ఆ ఎడిటర్ చేసిన తప్పే నన్ను ఈ స్థాయికి చేర్చింది: రాహుల్ ద్రవిడ్

పోర్ట్‌ఆఫ్ స్పెయిన్: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తాను ఈ స్థాయికి చేరడానికి కెరీర్ ఆరంభంలో ఓ పత్రికా ఎడిటర్ చేసిన తప్పిదమే కారణమని చెప్పాడు. పాఠశాల స్థాయి క్రికెట్ ఆడే సమయంలో పేపర్‌లో తన పేరు తప్పుగా అచ్చు వేయడంతో మరింత కసి పెరిగిందన్నాడు. ఇక టీమిండియా ది వాల్‌గా గుర్తింపు పొందిన రాహుల్ ద్రవిడ్ ఎన్నో ఘనతలను అందుకున్నాడు. భారత కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న ద్రవిడ్.. భారత ఒలింపిక్ విన్నర్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రాతో కలిసి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.

మన పేరు ప్రపచానికి పరిచయం చేయాలి..
'సక్సెస్ ఎంత పెద్దగా ఉండాలంటే, అది మన పేరును ప్రపంచానికి పరిచయం చేయాలి. నేను స్కూళ్లో జరిగిన ఓ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేశా. అప్పట్లో స్కూల్ టోర్నీల్లో జరిగిన మ్యాచులను కూడా పేపర్‌లో వేసేవాళ్లు. సెంచరీ తర్వాత ఆశగా నా పేరు ఉంటుందని పేపర్ తీసుకున్న నేను, ఆ వార్త చూసి షాక్ అయ్యా. నా పేరు రాహుల్ ద్రవిడ్ అయితే అందులో రాహుల్ డేవిడ్ అని రాశారు. ఆ వార్త రాసిన ఎడిటర్, నా పేరులో స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొచ్చని అనుకున్నాడేమో.

డేవిడ్ అని రావడంతో..
సాధారణంగా ద్రవిడ్ అనే పేరు ఎవ్వరికీ ఉండదు. అందుకే డేవిడ్ అయి ఉండొచ్చని డేవిడ్ అని రాసేశాడు. అప్పుడే అర్థమైంది. సెంచరీ చేసినా.. నా పేరు ఎవ్వరికీ తెలియదని. అందుకే నా పేరు అందరికీ తెలిసేలా చేయాలని అనుకున్నా. టాప్ పొజిషన్‌కి వెళ్లాలనే పట్టుదల పెరిగింది. కొన్నేళ్ల తర్వాత అదే పత్రికలో నా పేరు మెయిన్ పేపర్‌లో హెడ్‌లైన్‌గా వచ్చింది.' ద్రవిడ్ గుర్తు చేసుకున్నాడు.

కోచ్‌గా మార్క్..
టెస్టులు, వన్డేల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడైన రాహుల్ ద్రవిడ్, టీమిండియాకి కెప్టెన్‌గానూ విదేశాల్లో అద్భుత విజయాలు అందుకున్నాడు. అండర్ 19 కోచ్‌గా, ఎన్‌సీఏ హెడ్‌గా వ్యవహరించిన ద్రవిడ్.. రవిశాస్త్రి అనంతరం భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కోచ్‌గా జట్టులో అనేక మార్పులు చేసిన ద్రవిడ్ వైఖరి అభిమానులకు రుచించడం లేదు. అతని అనాలోచిత నిర్ణయాల కారణంగా ఏడాదిలోనే జట్టుకు ఏడుగురు కెప్టెన్లు అయ్యారు. ఇప్పటి వరకైతే కోచ్‌గా మార్క్ చూపించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications