Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చతేశ్వర్ పుజారా గోల్డెన్ డకౌట్.. కోచ్ ద్రవిడ్ ఏం చేశాడంటే? (వీడియో)

Rahul Dravid pats Cheteshwar Pujara’s back after he bags golden duck in first Test vs SA

సెంచూరియన్: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా వైఫల్యం కొనసాగుతోంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన పుజారా.. సౌతాఫ్రికా పర్యటనలోనూ అదే తడబాటును కొనసాగించాడు. కివీస్‌తో టెస్టు సిరీస్‌లో రెండు టెస్టుల్లో 0, 47, 26,22 పరుగులు మాత్రమే చేసిన పుజారా.. తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగి గోల్డెన్ డకౌటయ్యాడు. ఈ వైఫల్యంతో పుజారా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీ వంటి ఆటగాళ్లు భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తుండటంతో పుజారా వైఫల్యం చర్చనీయాంశమైంది.

వెన్నుతట్టిన ద్రవిడ్..

ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60) ఔటైన వెంటనే క్రీజులోకి వచ్చిన పుజారా.. ఎదుర్కొన్న తొలి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. లుంగి ఎంగిడి వేసిన ఇన్ స్వింగ్ డెలివరీని అంచనా వేయడంలో పుజారా విఫలమవ్వగా.. ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కైగన్ పీటర్సన్ ఏ తప్పు చేయకుండా ఆ బంతిని అందుకోవడంతో పుజారా కథ ముగిసింది. దాంతో అతను తీవ్ర నిరాశగా పెవిలియన్ చేరాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పుజారాపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం మరేం పర్లేదన్నట్లు వెన్నుతట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

ఔటైన అనంతరం డ్రెస్ మార్చుకొని టీమిండియా డగౌట్‌లోకి వచ్చిన పుజారా.. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రియాంక్ పాంచల్ పక్కన సైలెంట్‌గా నిలుచున్నాడు. వారికి దగ్గరగా వెళ్లిన కోచ్ రాహుల్ ద్రవిడ్.. పుజారా వీపు తడుతూ పర్లేదన్నట్లు అతని ఎంకరేజ్ చేశాడు. ఇక ద్రవిడ్ వెన్ను తట్టడంతో పుజారా చిరునవ్వులు చిందించాడు. ఇక ద్రవిడ్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్లేయర్‌గా పుజారా విఫలమైనా.. కోచ్‌గా వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా ద్రవిడ్ జాగ్రత్తపడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సెకండ్ ఇన్నింగ్స్‌ పుజారాకు అగ్ని పరీక్షలాంటిదనే చెప్పాలి.

సఫారీ గడ్డపై రెండో సారి..

సఫారీ గడ్డపై రెండో సారి..

ఇక సౌతాఫ్రికా గడ్డపై పుజారా గోల్డెన్ డకౌట్‌ కావడం ఇది రెండోసారి. యాదృశ్చికంగా రెండుసార్లు ఎన్గిడి బౌలింగ్‌లోనే ఔటవ్వడం గమనార్హం. 2017-18 సౌతాఫ్రికా పర్యటనలో సెంచూరియన్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో పుజారా ఎన్గిడి బౌలింగ్‌లో రనౌట్‌ అయ్యాడు. అప్పుడు ఒక్క బంతి మాత్రమే ఎదుర్కొన్న పుజారా పరుగులేమి చేయకుండానే రనౌట్‌ రూపంలో గోల్డెన్‌ డక్‌‌గా వెనుదిరిగాడు . తాజాగా మరోసారి పుజారా ఎన్గిడి బౌలింగ్‌లోనే అదే సెంచూరియన్‌లో గోల్డెన్‌ డక్‌ కావడం చర్చనీయాంశమైంది. చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడైన ఎన్గిడి ఐపీఎల్ సందర్భంగా పుజారా బలహీనతలను పసిగట్టాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దాంతో ప్లాన్ చేసి అతన్ని ఔట్ చేశాడంటున్నారు.

రాహుల్ సెంచరీ..

రాహుల్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. వైస్ కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్(234 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 115 బ్యాటింగ్) సెంచరీతో చెలరేగడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(123 బంతుల్లో 9 ఫోర్లతో 60)తో కలిసి తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించిన రాహుల్.. కోహ్లీ(35)తో కలిసి మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. చతేశ్వర్ పుజారా(0) ఒక్కడే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు.

Story first published: Sunday, December 26, 2021, 20:49 [IST]
Other articles published on Dec 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+