T20 World Cup 2022: రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్.. జట్టులోకి చేతన్ సకారియా, ముకేశ్ కుమార్.. ఎందుకంటే?

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా సన్నదమవుతోంది. రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు మిషన్ మెల్‌బోర్న్ పేరిట ప్రణాళికలు రచిస్తోంది. ఆసియాకప్ 2022 వైఫల్యంతో మేల్కోన్న రాహుల్ ద్రవిడ్.. జట్టును బలంగా మార్చడంపై దృష్టిసారించాడు. ఈ క్రమంలోనే భారత బ్యాటర్ల బలహీనతను సరిదిద్దే ప్రణాళిక రచించాడు.
టీమిండియాలో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నప్పటికీ..వీళ్లందరికీ ఉన్న వీక్‌నెస్ లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌ని ఫేస్ చేయలేకపోవడం. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో షాహీన్ ఆఫ్రిదీ, ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్, దానికి ముందు రీస్ టోప్లే... ఇలా లెఫ్టార్మ్ పేసర్ బౌలింగ్‌కి వస్తే చాలు, టీమిండియా వికెట్లు టపాటాపా పడిపోతాయి.

లెఫ్టార్మ్ బలహీనతపై..
ఈ క్రమంలోనే ఈ సమస్యను సరిదిద్దే ప్రణాళికను రాహుల్ ద్రవిడ్ సిద్దం చేశాడు. భారత బ్యాటర్లు లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడానికి గల కారణాన్ని గుర్తించిన దివాల్.. జట్టులో సరైన లెఫ్టార్మ్ పేసర్ లేకపోవడంతోనే భారత బ్యాటర్లు విఫలమవుతున్నారని గ్రహించాడు. జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో మరో ఎడమ చేతివాటం పేసర్‌ను భారత జట్టు తయారుచేయలేకపోయింది. ఇర్ఫాన్ పఠాన్ కొన్నాళ్లు ఆశలు రేపినా ఆ తర్వాత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయాడు. దీంతో కొన్నాళ్లుగా సరైన లెఫ్టార్మ్ బౌలర్ లేకుండానే ఆడుతున్న భారత జట్టుకు అర్ష్‌దీప్ సింగ్ రూపంలో ఓ బౌలర్ దొరికాడు.

చేతన్, ముకేశ్‌కు పిలుపు..
అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడిపైనే ఆధారపడటం కరెక్ట్ కాదని గ్రహించిన రాహుల్ ద్రవిడ్.. మరో ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లను నెట్‌బౌలర్లుగా ఎంచుకున్నాడు. ముందుగా వారిని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన ఛేతన్ సకారియాతో పాటు దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న ముకేశ్ కుమార్‌లను నెట్‌బౌలర్లుగా తీసుకున్నాడు. ఈ ఇద్దరు భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

నెట్స్‌లో ప్రాక్టీస్..
ప్రస్తుతం ఇరానీ ట్రోఫీ 2022లో సౌరాష్ట్ర తరుపున ఆడిన ఛేతన్ సకారియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ముకేశ్ కుమార్ ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తరుపున తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. నెట్స్‌లో భారత బ్యాటర్లకు వీరి చేత బౌలింగ్ చేయించి భారత బ్యాటర్ల బలహీనతను పోగెట్టే ప్రయత్నం ద్రవిడ్ చేయనున్నాడు. మరీ ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతోందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications