Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rahul Dravid: అవకాశాల కోసం విహారి, శ్రేయస్ వేచి చూడాల్సిందే.. మూడో టెస్ట్‌కు సిరాజ్ డౌటే!

Rahul Dravid indicates Hanuma Vihari and Shreyas Iyer might have to wait for regular chances till seniors are around

జొహన్నెస్‌బర్గ్: టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి, శ్రేయస్ అయ్యర్.. జట్టులో రెగ్యులర్ చాన్స్‌ల కోసం ఇంకొన్నాళ్లు వేచిచూడాల్సిందేనని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సీనియర్లు చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఉన్నంత వరకు ఇది తప్పదని హింట్స్ ఇచ్చాడు. రెండో టెస్ట్ ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్ ఆసక్తికర విషయాలు పంచుకుకన్నాడు. వెన్ను నొప్పితో రెండో టెస్ట్‌కు దూరమైన విరాట్ కోహ్లీ కేప్‌టౌన్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపాడు. అయితే తొడకండరాల గాయంతో బాధపడుతున్న మహమ్మద్ సిరాజ్ ఆడటం డౌటేనన్నాడు.

ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే..

ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే..

'రెండో ఇన్నింగ్స్‌ల్లో విహారి చాలా సూపర్బ్‌గా ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తు క్యాచ్ ఔటయ్యాడు. లేకపోతే మరిన్ని రన్స్ చేసేవాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చాలా బాగుంది. ఆ ఇన్నింగ్స్ వల్ల అతనిలో ఆత్వవిశ్వాసం పెరుగుతుంది. ఇక శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్ కంటెండర్. ఆడిన రెండు, మూడు మ్యాచ్‌ల్లోనూ అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు.

చాన్స్ వచ్చిన ప్రతిసారి అతను నిరూపించుకుంటున్నాడు. కచ్చితంగా ఈ ఇద్దరికి ఏదో ఓ రోజు టైమ్ అయితే వస్తుంది. అంతవరకు ఓపికగా వేచి చూడాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రహానే, పుజారా సెటప్‌ను కాదని వాళ్లకు చాన్స్ ఇవ్వలేం. మూడో మ్యాచ్‌కు కోహ్లీ కూడా అందుబాటులోకి వస్తున్నాడు. కాబట్టి లైనప్‌లో భారీ మార్పులు చేసే పరిస్థితులు ఉండకపోవచ్చు.'అని ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు.

తాను ఆడే రోజుల్లోనూ మిడిలార్డర్‌లో కోహ్లీ, పుజారా, రహానే నుంచి గట్టి పోటీ ఉండేదని, అయినా వాళ్లకు రెగ్యులర్‌గా అవకాశాలు రావడానికి ఏడాది రెండేళ్లు పట్టిందని గుర్తు చేశాడు. అప్పట్లో జూనియర్లుగా ఉన్న వీళ్లు.. కెరీర్ స్టార్టింగ్‌లోనే చాలా రన్స్ చేశారన్నాడు.

మూడో టెస్ట్‌కు సిరాజ్ డౌట్..

మూడో టెస్ట్‌కు సిరాజ్ డౌట్..

తొడకండరాల గాయం నుంచి పేసర్ మహమ్మద్ సిరాజ్ పూర్తి కోలుకోలేదని ద్రవిడ్ వెల్లడించాడు. దీంతో కేప్ టౌన్‌లో జరిగే థర్డ్ టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండటం కష్టమేనన్నాడు. 'సిరాజ్ ఫిట్‌గా లేడు. తర్వాతి నాలుగు రోజుల్లో అతని ఫిట్‌నెస్‌ను టెస్ట్ చేయాలి. ఫిజియో స్కానింగ్స్ తీస్తున్నాడు. ఇంజ్యూరీ ఎంత మేరకు ఉందో చూడాలి.

మ్యాచ్ ముందు రోజు ఉన్న పరిస్థితులను ఎలెవన్‌పై డెసిషన్ తీసుకుంటాం. ఫిఫ్త్ బౌలర్ ఆప్షన్ ఉండటం వల్ల మా స్ట్రాటజీలకు పెద్దగా ఇబ్బంది కలగలేదు.'అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ఇక మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా విహారికి తగిలిన గాయంపై తనకు సరైన సమాచారం లేదన్నాడు. ఫిజియోతో దీని గురించి చర్చించలేదని చెప్పాడు.

కోహ్లీ వస్తాడు..

కోహ్లీ వస్తాడు..

వెన్నుగాయంతో బాధపడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులోకి వస్తాడని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'మూడో టెస్టు వరకూ అన్ని రకాలుగా కోహ్లీ సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. కసరత్తులు చేసుకోవడానికి అతనికి సమయం దొరికింది. కేప్‌టౌన్‌లో నెట్‌ సెషన్స్‌ ద్వారా అతను తిరిగి లయ అందుకుంటాడు.

అతనితో మాట్లాడాక చివరి టెస్టుకు అందుబాటులో ఉంటాడనిపిస్తోంది'' అని ద్రవిడ్‌ చెప్పాడు. ఈ పిచ్‌లపై బ్యాటింగ్‌ చేయడం రెండు జట్లకు సవాలుగా మారిందన్న ద్రవిడ్.. సెకండ్ టెస్ట్‌లో నాలుగో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ పరంగా సౌతాఫ్రికాకు ఉత్తమమైందన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 50 పరుగులు తక్కువ చేసామని, అదే ఓటమికి కారణమైందన్నాడు.

అందుకే అశ్విన్‌తో బౌలింగ్..

అందుకే అశ్విన్‌తో బౌలింగ్..

రెండో టెస్ట్ నాలుగో రోజు మధ్యాహ్నం.. అశ్విన్‌తో బౌలింగ్ చేయించడంపై విమర్శలు వచ్చినా.. ద్రవిడ్ మాత్రం సమర్థించుకున్నాడు. 'వెట్ ఫీల్డ్ వల్ల బాల్ తడిగా మారితే పేసర్లకు బౌలింగ్ కష్టమవుతుంది. థర్డ్ డే అశ్విన్ మంచి స్పెల్ వేశాడు. కాబట్టే నాలుగో రోజు అతన్ని కొనసాగించాం. కానీ డ్రై బాల్ మాకు వర్కౌట్ కాలేదు.'అని రాహుల్ ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఔటైన విధానంపై ద్రవిడ్‌ స్పందించాడు. షాట్‌ ఎంపిక, ఆడిన సమయం గురించి పంత్‌తో మాట్లాడతానని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా కష్టాల్లో ఉన్న సమయంలో పంత్‌ తాను ఎదుర్కొన్న మూడో బంతినే భారీషాట్‌కు ప్రయత్నించి వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కాడు.

Story first published: Saturday, January 8, 2022, 10:01 [IST]
Other articles published on Jan 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+