Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ కాదు.. అతని కెప్టెన్సీకి నేను డైహార్డ్ ఫ్యాన్: రాహుల్ ద్రవిడ్

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని కెప్టెన్సీకి తాను డైహార్డ్ ఫ్యాన్ అని తెలిపాడు. ముఖ్యంగా ఆటగాళ్లతో రోహిత్ శర్మ మానసికంగా కనెక్ట్ అయ్యే విధానం అద్భుతమని కొనియాడాడు. జట్టు కోసం చాలా శ్రద్ద తీసుకునే రోహిత్.. డ్రెస్సింగ్ రూమ్‌లో మంచి వాతావారణాన్ని కొనసాగించాడని, తన లక్ష్యాల పట్ల చాలా స్పష్టతతో ఉండేవాడని చెప్పాడు.

తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. రోహిత్ శర్మ సారథ్యం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కోచ్‌గా రోహిత్ శర్మతో పనిచేసిన అనుభవాన్ని నెమరువేసుకున్నాడు.

కోచ్‌గా నా పనే అది..

'రోహిత్ శర్మ జట్టు గురించి చాలా లోతుగా ఆలోచిస్తాడు. కెప్టెన్‌గా బాధ్యతల చేపట్టిన తొలి రోజు నుంచే జట్టును ఎలా నడపాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై చాలా క్లారిటీగా ఉన్నాడు. కెప్టెన్, కోచ్ మధ్య ఈ క్లారిటీ చాలా ముఖ్యం. జట్టు ఎప్పుడూ కెప్టెన్ టీమ్‌గానే ఉండాలి. నేను ఆటగాడిగా.. కెప్టెన్‌గా కూడా వ్యవహరించాను. కెప్టెన్ అనేవాడు తన లక్ష్యాలకు అనుగుణంగా జట్టును నడిపించాలి. కోచ్ అనేవాడు కెప్టెన్‌కు అండగా ఉండాలి. అతనికి అవసరమైన సహాయం అందించాలి.

Rahul Dravid Hails Rohit Sharma s Captaincy Says He Deeply Cared About the Team

రోహిత్‌తో నేను చాలా విషయాల్లో స్పష్టత చూశాను. జట్టు నుంచి అతను ఏమి కోరుకుంటున్నాడు? వాతావరణం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అనే విషయాల్లో చాలా స్పష్టంగా ఉన్నాడు. అతని అనుభవం ఈ విషయాలను సెట్ చేయడంలో సహాయపడింది. నా పని కేవలం అతనితో కలిసి పనిచేయడం, కొన్నిసార్లు అతని నిర్ణయాలను సవాలు చేయడం, అనతు సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం. కెప్టెన్‌గా రోహిత్ సౌకర్యంగా ఉంటేనే అతను బాగా ఆడటంతో పాటు మిగిలిన వారిని కూడా బాగా ఆడించేలా చేస్తాడని నాకు తెలుసు.

రోహిత్ కెప్టెన్సీ బలం అదే..

రోహిత్‌లో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే.. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. జట్టుతో బాగా కనెక్ట్ అవుతాడు. ఏది ఏమైనా కోచ్‌గా అతనితో పనిచేయడం గొప్ప అనుభవం. అతని కెప్టెన్సీ అంటే నాకు చాలా ఇష్టం. అతనితో మాట్లాటాన్ని నేను బాగా ఆస్వాదిస్తాను. మేం కేవలం క్రికెట్ గురించే కాకుండా ఇతర విషయాలు కూడా మాట్లాడుకునేవాళ్లం. రోహిత్ శర్మను ఓ యువకుడిగా.. అండర్ 19 కుర్రాడిగా చూసి.. నా చేతుల మీదనే అరంగేట్ర క్యాప్ అందించడం.. అతను గొప్ప సారథిగా ఎదగడం చాలా సంతోషంగా ఉంది. అతని కెప్టెన్సీ బలం ఆటగాళ్లతో మానసికంగా కనెక్ట్ కాగడం. ఈ విషయం (అశ్విన్) మీకు కూడా తెలుసు. మీరు కూడా అతని సారథ్యంలో ఆడారు. అతని కెప్టెన్సీని ఆస్వాదించారనుకుంటున్నా.'అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, August 22, 2025, 11:08 [IST]
Other articles published on Aug 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+