Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌ను తప్పుబట్టిన రాహుల్ ద్రవిడ్!

టీమిండియాలో సూపర్ స్టార్ కల్చర్‌ను అంతం చేయాలనే గౌతమ్ గంభీర్ ఆలోచనను మాజీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. ఏ ఆటకైనా హీరోలు చాలా అవసరమని, వారి అద్భుత ప్రదర్శనలే భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తాయని తెలిపాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా.. గౌతమ్ గంభీర్ నయా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

అయితే గంభీర్ కోచ్‌గా ఎంపికైన తర్వాత జట్టులో స్టార్ కల్చర్‌కు తెరదించాడు. జట్టులోని ఆటగాళ్లంతా సమానమేనని, సూపర్ స్టార్ కల్చర్‌తో టైటిల్స్ గెలవలేమని పదే పదే చెప్పుకొచ్చాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. గౌతమ్ గంభీర్ ఆలోచన విధానంతో విభేదించాడు.

ఏ ఆటకైనా హీరోలు అవసరం..

'ఏ క్రీడకైనా హీరోలు అవసరం. మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చకుండా ఎవరూ హీరోలు కాలేరు. తమ ప్రతిభను నిరూపించుకోకపోతే దేశ ప్రజల హృదయాలను గెలుచుకోలేరు. ముఖ్యంగా భారత్‌లో ప్రశంసలతో పాటు విమర్శలు, ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.

ఎల్లప్పుడూ ఆటగాళ్లపై నిఘా, నిరంతర దృష్టి ఉంటుంది. వాటన్నింటిని తట్టుకుంటేనే సూపర్ స్టార్ అవుతారు. అలా ఎదిగారంటే వారు అన్ని పనులు సక్రమంగా చేశారని, జట్టు విజయానికి సహాయపడ్డారని అర్థం.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

Rahul Dravid Counters Gautam Gambhir s Anti-Superstar Stance Any Sport Needs Its Heroes

ఆ ముగ్గుర్ని భర్తీ చేయడం..

గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతల చేపట్టిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా సత్తా చాటినా.. టెస్ట్ క్రికెట్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. చరిత్రలో ఎరుగని ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఈ వ్యవహారంపై స్పందించిన ద్రవిడ్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి ఆటగాళ్లు ఒకేసారి రిటైర్మెంట్ ప్రకటించడం జట్టును దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదన్నాడు.

'టెస్ట్ క్రికెట్‌లో రాణించాలనే పట్టుదల ఉండాలి. ఇటీవల కొన్ని సిరీస్‌ల్లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇలా జరగడం సహజమే. రోహిత్, విరాట్ కోహ్లీ, అశ్విన్ ఆటగాళ్లు రిటైర్ అవ్వడంతో వారి లోటు స్పష్టంగా కనిపిస్తోంది. వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. కానీ భారత క్రికెట్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది.

భారత జట్టు ఆడే ప్రతి ఫార్మాట్‌లోనూ గట్టి పోటీనిస్తుందనే నమ్మకం నాకుంది. కాస్త సమయం పట్టవచ్చు. ఈ తరం ఆటగాళ్లు ఎక్కువగా వైట్ బాల్ క్రికెట్ ఆడుతుండటంతో రెడ్ బాల్ ఫార్మాట్‌కు సన్నదమయ్యే సమయం దొరకడం లేదు. ఇది వారి తప్పు కాదు. ప్రస్తుత క్రికెట్ షెడ్యూల్ అలా ఉంది.'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 16, 2026, 17:37 [IST]
Other articles published on May 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+