న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka: ఎమోషనల్ అయిన రాహుల్‌ ద్రవిడ్‌..డ్రస్సింగ్‌ రూమ్‌ నుంచి మైదానంలోకి వచ్చి (వీడియో)

Rahul Dravid Becomes Emotional With Deepak Chahar After Winning 2nd ODI with Sri Lanka

కొలంబో: రాహుల్‌ ద్రవిడ్‌ అంటేనే 'మిస్టర్‌ కూల్‌'. మ్యాచ్‌ ఎంత ఉత్కంఠంగా సాగుతున్నా.. అతడు మాత్రం ప్రశాంతంగానే ఉంటాడు. ప్రత్యర్థి బౌలర్లు కవ్వించినా, స్లెడ్జింగ్ చేసినా.. తన మాటలతో కాకుండా బ్యాటుతోనే సమాధానం చెప్పేవాడు. ఎప్పుడూ ఎమోషనల్ అయిన సందర్భం కూడా పెద్దగా లేదు. ఇది కెరీర్ ఆరంభం నుంచే మనం చూస్తున్నాం. అయితే మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మాత్రం 'ది వాల్' ఎంతో బాగోద్వేగానికి గురయ్యాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ గెలవడంతో సంతోషం పట్టలేక మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను హత్తుకున్నాడు.

ఎమోషనల్ అయిన ది వాల్

శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 160 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన పేసర్ దీపక్‌ చహర్‌ (69 నాటౌట్; 82 బంతుల్లో 7×4, 1×6), మరో పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌తో కలిసి జట్టుకు విజయం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి 8వ వికెట్‌కు 84 పరుగులు జోడించారు.

దీపక్‌ చివరి ఓవర్ మొదటి బంతి బౌండరీ బాది టీమిండియాకు ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో డ్రస్సింగ్‌ రూమ్‌లో భారత ఆటగాళ్లు ఎగిరి గంతులేశారు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎమోషనల్ అయ్యాడు. మైదాంలోకి వచ్చి దీపక్‌ను గట్టిగా హత్తుకున్నాడు. ది వాల్ గతంలో ఎన్నడూ ఇలా బాగోద్వేగానికి గురైన సందర్భాలు లేవు.

ద్రవిడ్ ఆందోళన

ద్రవిడ్ ఆందోళన

అంతకుముందు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది. వెంటనే డ్రస్సింగ్‌ రూమ్‌ నుంచి డగౌట్‌కు చేరుకున్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్న దీపక్‌ చహర్‌కు తమ్ముడు రాహుల్‌ చహర్‌తో సందేశం పంపించాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన లెగ్‌స్పిన్నర్‌ హసరంగ ప్రమాదకరంగా బౌలింగ్‌ చేస్తున్నాడు.

దాంతో అతడి బౌలింగ్‌లో షాట్లు ఆడొద్దని ద్రవిడ్‌ సూచించాడు. 47వ ఓవర్లో దీపక్‌కు తిమ్మిర్లు రావడంతో ఫిజియోతో పాటు రాహుల్‌ చహర్‌ అక్కడికి చేరుకొన్నాడు. ద్రవిడ్‌ సందేశాన్ని తన సోదరుడికి అందించాడు. ఆ తర్వాత హసరంగ వేసిన రెండు ఓవర్లలో భారత్ షాట్లు ఆడలేదు. మిగతా వారి బౌలింగ్‌లో పరుగులు రాబట్టి విజయం సాధించింది.

ఓడిపోయినా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు

ఇక శ్రీలంక‌పై రెండో వ‌న్డే గెలిచిన త‌ర్వాత రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్‌లో యువ క్రికెట‌ర్ల‌ను ఉద్దేశించి ఇచ్చిన స్పీచ్ వీడియోను బీసీసీఐ ట్విట‌ర్‌లో షేర్ చేసింది. 'మ‌నం ప్ర‌తిఘ‌టిస్తామ‌ని వాళ్ల‌కు తెలుసు. మ‌నం ప్ర‌త్య‌ర్థిని కూడా గౌర‌వించాలి. వాళ్లు స‌వాలు విసిరారు.

దానికి ఓ చాంపియ‌న్ టీమ్‌లా మ‌నం రెస్పాండ్ అయ్యాం. మిమ్మ‌ల్ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంది' అని ద్ర‌విడ్ అన్నాడు. ఒక‌వేళ ఓడిపోయినా పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదని, పైట్ చేయ‌డం అనేది ముఖ్యమన్నాడు. బాగా ఆడారని యువ క్రికెట‌ర్ల‌పై ద్ర‌విడ్ ప్ర‌శంస‌లు కురిపించాడు.

India vs Sri Lanka: ఓటమి జీర్ణించుకోలేక కెప్టెన్‌తో కోచ్‌ గొడవ.. కెరీర్ ముగినట్టే ఇగ!! (వీడియో)

రాహుల్‌ సర్‌ అదే చెప్పారు

రాహుల్‌ సర్‌ అదే చెప్పారు

మ్యాచ్ అనంతరం దీపక్‌ చహర్‌ మాట్లాడుతో కోచ్ రాహుల్ ద్రవిడ్‌ సలహాతోనే బాగా ఆడాడని చెప్పాడు. 'దేశానికి విజయం అందించేందుకు మరో దారి లేదు. అన్ని బంతులు ఆడాలని రాహుల్‌ సర్‌ చెప్పారు. ఆయన కోచింగ్‌లో నేను భారత్‌-ఏ తరఫున కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడాను.

ఆయనకు నాపై నమ్మకం ఉంది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు నేను సరిపోతానని అన్నారు. నమ్మకం ఉంచారు. ఇకపై జరిగే మ్యాచుల్లో నా వరకు బ్యాటింగ్‌ రాదనే అనుకుంటున్నా. లక్ష్యం 50 పరుగుల్లోపు వచ్చినప్పుడు గెలుస్తామనే ధీమా కలిగింది. అంతకు ముందు ఒక్కో బంతిని ఆడుతూ ముందుకు సాగాను. ఇలాంటి ఇన్నింగ్స్‌ ఆడాలని నేనెప్పటి నుంచో కలగంటున్నా' అని తెలిపాడు.

Story first published: Wednesday, July 21, 2021, 13:10 [IST]
Other articles published on Jul 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X