కేఎల్ రాహుల్‌కు మరిన్ని అవకాశాలు ఇస్తాం: ద్రవిడ్

న్యూఢిల్లీ: నిలకడలేమి ఫామ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. కేఎల్ రాహుల్ తమ సక్సెస్ ఫుల్ ఓపెనరని, అతనికి టీమ్‌మేనేజ్‌మెంట్ మద్దతు ఉంటుందని తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం ముగిసిన రెండో టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కేఎల్ రాహుల్( 17, 1) దారుణంగా విఫలమయ్యాడు. దాంతో అతన్ని పక్కనపెట్టాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. వెంకటేశ్ ప్రసాద్ వంటి దిగ్గజ ప్లేయర్ అయితే.. రాహుల్‌కు వచ్చిన అవకాశాలు మరెవరీకి రాలేదని విమర్శించాడు.

పేలవ ఫామ్‌తో..
దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం రాహుల్ ఫామ్‌పై విమర్శలు గుప్పించాడు. వైస్ కెప్టెన్‌ను పక్కనపెట్టవద్దనే రూల్ ఉందా? అని ప్రశ్నించాడు. కేఎల్ రాహుల్ కోసం సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టారు. ఇది అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. వన్డే, టీ20 ఫార్మాట్‌లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్న శుభ్‌మన్‌ను కాదని రాహుల్‌ను ఆడించడం అన్యాయమని మండిపడుతున్నారు. రెండో టెస్ట్ వైఫల్యంతో అతను చివరి రెండు టెస్ట్‌లకు దూరమవుతాడని అంతా భావించారు.

మా మద్దతు ఉంటుంది..
కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ మాత్రం కేఎల్ రాహుల్‌కు అండగా ఉంటుంది. మ్యాచ్ అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన ద్రవిడ్.. కేఎల్ రాహుల్‌కు మద్దతుగా నిలిచాడు. 'కేఎల్ రాహుల్ కెరీర్‌లో ఇది ఒక దశ మాత్రమే. అతను విదేశాల్లో మా విజయవంతమైన ఓపెనర్లలో ఒకడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో సెంచరీలు సాధించాడు.
కేఎల్ రాహుల్‌కు మా మద్దతు కొనసాగిస్తాం. ప్రస్తుత స్థితి నుంచి బయటపడే నైపుణ్యం రాహుల్ వద్ద ఉంది. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తాం'అని రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశాడు.

రోహిత్ శర్మ సైతం..
కెప్టెన్ రోహిత్ శర్మ సైతం కేఎల్ రాహుల్‌ను వెనకేసుకొచ్చాడు. 'ఇటీవలి కాలంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి చాలా చర్చ జరుగుతోంది. కానీ మేం టీమ్ మేనేజ్‌మెంట్‌గా ఆటగాడి సత్తాను చూస్తాం. ఇది కేవలం కేఎల్ గురించే కాదు. గతంలో కూడా చాలా మంది ఆటగాళ్ల విషయంలో ఇదే ప్రశ్న నాకు ఎదురైంది. ఒక ఆటగాడిలో సత్తా ఉంటే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వడం సహజం.' అని రోహిత్ తెలిపాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పలుమార్లు రాహుల్ కొన్ని కీలక ఇన్నింగ్సులు ఆడాడని గుర్తుచేశాడు.

విదేశాల్లో సెంచరీలు..0
'ఇది కేవలం కేఎల్ ఒక్కడే కాదు.. ఎవరైనా సరే. అతను విదేశాల్లో చేసిన సెంచరీలు (2021లో ఇంగ్లండ్‌లో, 2022లో సౌతాఫ్రికాలో) చూస్తే.. నేను చూసిన బెస్ట్ రాహుల్ ఇన్నింగ్సుల్లో అవి ఉంటాయి. ముఖ్యంగా లార్డ్స్‌లో అతని ఇన్నింగ్స్ అద్భుతం. ఇంగ్లండ్‌లో అలాంటి పిచ్‌పై ఆడటం, అదీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగడం మాటలు కాదు. కానీ రాహుల్ ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. సౌతాఫ్రికాపై సెంచూరియన్‌లో చేసిన శతకం ఇంకో గొప్ప ఇన్నింగ్స్. ఆ రెండు మ్యాచుల్లో భారత్ గెలిచింది. అతనిలో అంత సత్తా ఉంది' అని రోహిత్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications