Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాహుబలి క్రికెటర్ భారీ సిక్సర్.. కొడితే స్డేడియం బయటే!

హైదరాబాద్: ప్ర‌పంచంలోనే భారీకాయుడైన వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ ర‌కీం కార్న్‌వాల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్న్ వాల్.. ఈ సీజన్ ఆరంభంలో వేగంగా పరుగు తీయలేక రనౌటై నవ్వుల పాలయ్యాడు. కానీ ఈసారి భారీ సిక్సర్ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. 101 మీటర్ల భారీ సిక్స్ బాది అభిమానుల ప్రశంసలు అందుకున్నాడు.

సీపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా సెయింట్ లూసియా కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ వెస్టిండీస్ బాహుబలి ఈ భారీ సిక్సర్ బాదాడు. బంతిని కొడితే స్డేడియం పైకప్పును తాకింది. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Rahkeem Cornwall hits a 101M six in the CPL 2023 goes viral

మాథ్యూ ఫోర్ట్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో రెండో బంతిని, ఐదో బంతిని కార్న్‌వాల్ సిక్స్‌గా మలిచాడు. ఈ రెండు కూడా భారీ సిక్సర్లు కావడం విశేషం. బ్యాక్‌వర్డ్ స్క్వేర్ దిశగా కొట్టిన ఐదో బంతి ప్రేక్షకుల గ్యాలరీ పైకప్పును తాకింది. 101 మీటర్లు దూరం వెళ్లింది. ఈ క్యాచ్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.

అయితే ఈ మ్యాచ్‌లో రకీమ్ కార్న్ వాల్ టీమ్ బార్బోడస్ రాయల్స్ 90 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. భారీ సిక్సర్లతో అలరించిన రకీమ్ కార్న్‌వాల్(18)‌ను అల్జారీ జోసెఫ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 195 పరుగులు చేసింది. జాన్సన్ చార్లెస్(78) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బార్బోడస్ రాయల్స్ 17.3 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలి ఘోరపరాజయాన్ని మూటగట్టుకుంది. నయిమ్ యంగ్(20), రకీమ్ కార్న్ వాల్(18), జాస్ హోల్డర్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అల్జారీ జోసెఫ్(3/7) మూడు వికెట్లతో బార్బోడస్ పతనాన్నిశాసించాడు.

Story first published: Sunday, September 3, 2023, 18:50 [IST]
Other articles published on Sep 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+