Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..!

న్యూజిలాండ్ బ్యాటర్ రచిన్ రవీంద్ర చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా రచిన్ రవీంద్ర అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. రచిన్ రవీంద్రకు ఇదే అరంగేట్ర ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్.

ఈ టోర్నీ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ వేదికగా జరిగిన ముక్కోణపు సిరీస్‌లో రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ పట్టే క్రమంలో బంతి అతని నుదిటికి బలంగా తాకింది. దాంతో ఆ సిరీస్‌ మొత్తానికి దూరమైన రచిన్ రవీంద్ర.. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్ ఆడలేదు. పూర్తిగా కోలుకోని తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Rachin Ravindra Creates History As Becomes First Player In The World

అసాధారణ బ్యాటింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన రచిన్ రవీంద్ర అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ముందుగా 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రచిన్ రవీంద్ర.. డెవాన్ కాన్వేతో కలిసి మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. అనంతరం టామ్ లాథమ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..
ఈ శతకంతో రచిన్ రవీంద్ర చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీలో శతకం బాదిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రచిన్ రవీంద్ర.. సెంచరీతో చెలరేగాడు. అతనికి ఇదే తొలి ప్రపంచకప్ మ్యాచ్. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు 19 మంది తమ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేయగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ఆటగాళ్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే శతకం సాధించారు. కానీ రెండు టోర్నీల్లో అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్ రచిన్ రవీంద్ర మాత్రమే.

వన్డేల్లో రచిన్ రవీంద్రకు ఇది నాలుగో శతకం. 30 ఇన్నింగ్స్‌ల్లోనే అతను నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. అయితే ఈ నాలుగు సెంచరీలు ఐసీసీ ఈవెంట్స్‌లో నమోదు చేయడం గమనార్హం. రచిన్ రవీంద్ర సెంచరీతో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ చేరింది.

Story first published: Tuesday, February 25, 2025, 6:03 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+