For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ అస్సలు ప్రాక్టీస్ చేసేవాడు కాదు.. 12 ఏళ్ల క్రితమే మానేశాడు: మాజీ ఫీల్డింగ్ కోచ్

టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీస్ గురించి మాజీ ఫీల్డింగ్ కోచ్, తెలుగు తేజం ఆర్ శ్రీధర్ సంచలన విషయాలను బయటపెట్టాడు. ధోనీ అస్సలు కీపింగ్ ప్రాక్టీస్ చేసేవాడు కాదని చెప్పాడు. 12 ఏళ్ల క్రితమే అతను వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం మానేశాడని తెలిపాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకడు. వికెట్ల వెనుకాల రెప్పపాటు సమయంలో స్టంప్ ఔట్ చేయడం.. అసాధారణ క్యాచ్‌లు అందుకోవడం ధోనీ కీపింగ్ శైలి. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ వికెట్ల వెనుకాల చాలా చురుకుగా ఉన్నాడు. బ్యాటింగ్‌లో తడబడుతున్నా.. కీపింగ్ విషయంలో మాత్రం వేలు పెట్టి చూపడానికి లేదు. అతని వికెట్ కీపింగ్ టెక్నిక్ సాధారణ పద్దతులకు భిన్నంగా ఉంటుంది.

వికెట్లను చూడకుండా రనౌట్ చేయడం.. కచ్చితమైన డీఆర్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకోవడం.. బ్యాటర్ల కదలికలకు తగ్గట్లు బౌలర్లతో వ్యూహాలు రచించడం వికెట్ కీపర్‌గా ధోనీ స్పెషాలిటీ. అయితే కీపింగ్‌లో ఇంతలా రాణించాలంటే ఎంతో ప్రాక్టీస్ అవసరం. సాధారణంగా వికెట్ కీపర్స్.. నెట్స్‌లో బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ధోనీ మాత్రం వికెట్ కీపింగ్ ప్రాక్టీస్‌ను 17 ఏళ్ల క్రితమే మానేశాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీధర్ వెల్లడించాడు.

R Sridhar Reveals MS Dhoni s Unique Wicketkeeping Approach

అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు..

'అంతర్జాతీయ క్రికెట్‌లో 8-9 ఏళ్లు ఆడిన తర్వాత ధోనీ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేయడం మానేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకునే ముందు అతను తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై చాలా కష్టపడ్డాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడటం మొదలుపెట్టినప్పుడు అతనిపై వర్క్‌లోడ్ ఎక్కువైంది. వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు క్యాచ్‌లు పట్టడం, త్రోలు సేకరించడం ద్వారా తన చేతి వేళ్లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ధోనీ గ్రహించాడు. దాంతో కీపింగ్ ప్రాక్టీస్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

ప్రాక్టీస్ ఆపేయడం వల్ల తన కీపింగ్ నైపుణ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డాడు. వికెట్ కీపింగ్ బదులుగా.. బాడీ మూమెంట్స్ కసరత్తులు చేసేవాడు. బంతి లేకుండా వికెట్ల వెనుకాల మూమెంట్స్ ఇచ్చేవాడు. అది అతను మెరుపు వేగంతో కీపింగ్ చేసేలా చేసింది.'అని శ్రీధర్ వెల్లడించాడు.

కీపర్‌గా.. 829 వికెట్లు

అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో వికెట్ కీపర్‌గా ధోనీ 829 మంది ఔట్లలో పాలుపంచుకున్నాడు. ఇందులో 634 క్యాచ్‌లతో పాటు 195 స్టంపౌట్స్ ఉన్నాయి. ఇది వరల్డ్ రికార్డ్. ప్రాక్టీస్ లేకుండానే పదునైన క్రికెట్ పరిజ్ఞానంతో అతను రాణించగలిగాడు. 44 ఏళ్ల వయసులోనూ ఐపీఎల్ 2025 సీజన్‌లో సీఎస్‌కే తరఫున 6 క్యాచ్‌లు పట్టడంతో పాటు 6 స్టంపౌట్స్ చేశాడు. ఇప్పటికీ అతని వికెట్ కీపింగ్‌లో పదును తగ్గలేదు.

Story first published: Tuesday, August 26, 2025, 10:47 [IST]
Other articles published on Aug 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+