హార్దిక్ పాండ్యాను అడ్డు పెట్టి ముంబై ఆ ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది: అశ్విన్
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ వార్తలపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ ప్రయత్నాలు వాస్తవమేనని చెప్పిన అశ్విన్.. కేవలం సీఎస్‌కే, కేకేఆర్‌తోనే కాకుండా తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఇతర ఫ్రాంచైజీలతో కూడా ముంబై ఇండియన్స్ బేరసారాలు జరుపుతుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలతో కూడా ముంబై ఇండియన్స్ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని అశ్విన్ తెలిపాడు.
ఇషాన్ కిషన్ కోసం SRHతో..
'సీఎస్‌కే, కేకేఆర్ కాకుండా ముంబై ఇండియన్స్ ఇతర జట్ల వైపు కూడా చూడవచ్చు. హార్దిక్ పాండ్యాకు బదులుగా ఒక భారతీయ బ్యాటర్, ఒక విదేశీ/భారతీయ బౌలర్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై డీల్‌కు ప్రయత్నించవచ్చు. గతంలో ముంబై ఆటగాడిగా ఉన్నఇషాన్ కిషన్‌ను హార్దిక్ పాండ్యాకు బదులుగా వారు అడగవచ్చు. ఇషాన్ కిషన్, శివాంగ్ కుమార్ లాంటి ఆటగాడు వస్తే హార్దిక్ పాండ్యా సమాన విలువ లభిస్తుంది.

కేఎల్ రాహుల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో కూడా ముంబై డీల్‌కు ప్రయత్నించవచ్చు. కాబట్టి హార్దిక్ ట్రేడ్ కోసం ముంబై కేవలం సీఎస్‌కే, కేకేఆర్‌తో కాకుండా ఇతర జట్లతో కూడా డీల్‌కు ప్రయత్నాలు చేయవచ్చు.
పంజాబ్, లక్నోతో పాటు..
ప్రియాన్ష్ ఆర్య లేదా సూర్యాన్ష్ షెడ్గేతో పాటు మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ కోసం పీబీకేఎస్ కోసం డీల్‌కుప్రయత్నించవచ్చు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్‌లోని యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, తుషార్ దేశ్ పాండేలను హార్దిక్ పాండ్యాకు బదులుగా అడగవచ్చు. నికోలస్ పూరన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్‌ను సంప్రదించవచ్చు. పూరన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముంబై ఫ్రాంచైజీల తరఫున ఆడుతాడు.
హార్దిక్ పాండ్యాకు బదులుగా ప్రిన్స్ యాదవ్, మోహ్‌సిన్ ఖాన్‌తో పాటు నికోలస్ పూరణ్‌ను ముంబై అడగవచ్చు. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఒక కెప్టెన్ కోసం కూడా చూస్తోంది. కాబట్టి హార్దిక్ పాండ్యాను తీసుకోవడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.'అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

