Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ శర్మ కంటే అతను పుల్ షాట్ బాగా ఆడుతాడు: అశ్విన్

క్రికెట్‌లో పుల్ షాట్‌‌ను అద్భుతంగా ఆడే ప్లేయర్ ఎవరైనా ఉన్నారా? అంటే అందరూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరు చెబుతారు. విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్.. రోహిత్ పుల్ షాట్.. ధోనీ హెలీకాప్టర్ షాట్, సెహ్వాగ్ అప్పర్ కట్, సచిన్ స్ట్రైట్ డ్రైవ్ ఎప్పటికీ మరిచిపోలేరు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఇందులో కొన్ని షాట్లకు ఇతర ఆటగాళ్ల పేర్లు సూచించాడు.

రోహిత్ శర్మ కంటే ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ పుల్ షాట్ అద్భుతంగా ఆడుతాడని కొనియాడాడు. విరాట్ కోహ్లీ కంటే ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ మైకేల్ వాన్ కవర్ డ్రైవ్ బాగుంటుందని ప్రశంసించాడు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ ఈ విషయాలు పంచుకున్నాడు. ర్యాపిడ్ ఫైర్ సెషన్‌లో కొన్ని ఫేవరేట్ షాట్లకు ఆటగాళ్ల పేర్లు సూచించాడు.

R Ashwin Snubs Rohit Sharma and Picks Ricky Ponting As Player With Best Pull Shot

'రోహిత్ శర్మ కంటే రికీ పాంటింగ్ పుల్ షాట్ అద్భుతంగా ఆడుతాడు. మార్కస్ ట్రెస్కోథిక్, మైకేల్ వాన్ కవర్ డ్రైవ్స్ బాగుంటాయి. సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్‌తో పాటు అప్పర్ కట్ బాగా ఆడుతాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ కోసం సన్నదమవుతున్న అశ్విన్.. ఓ అరుదైన రికార్డ్‌పై కన్నేసాడు. మరో 14 వికెట్లు సాధిస్తే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ అగ్రస్థానంలో ఉన్నాడు. లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో ఉన్న కమిన్స్ 42 టెస్టుల్లో 175 వికెట్లు తీశాడు. ఇక మూడో స్థానంలో ఉన్న అశ్విన్ 35 టెస్టుల్లోనే 174 వికెట్లు పడగొట్టాడు.

స్పిన్‌కు అనుకూలించే భారత్ పిచ్‌లపై ఈ రికార్డును అశ్విన్ సునాయాసంగా అందుకుంటాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అశ్విన్ మరో 26 వికెట్లు సాధిస్తే వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 200 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా నిలుస్తాడు.

ఇప్పటివరకు 100 టెస్టులు ఆడిన అశ్విన్ 516 వికెట్లు పడగొట్టాడు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చెన్నై వేదిక జరగనుంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనుంది.

Story first published: Monday, September 16, 2024, 22:29 [IST]
Other articles published on Sep 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+