2027 వన్డే ప్రపంచకప్‌కు పంత్, షమీ అవసరం లేదు.. కానీ ఆ 36 ఏళ్ల బౌలర్‌ను తీసుకోవాలి: అశ్విన్
2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ప్రతిపాదిత భారత జట్టును ప్రకటించాడు. ఆశ్చర్యకరంగా ఈ టోర్నీకి రిషభ్ పంత్, మహమ్మద్ షమీ వంటి సీనియర్ ఆటగాళ్లు అవసరం లేదని చెప్పిన అశ్విన్.. 36 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌ను కచ్చితంగా తీసుకోవాలని పేర్కొన్నాడు. అయితే 2022 జనవరిలో భువనేశ్వర్ కుమార్ భారత్ తరఫున చివరి వన్డే మ్యాచ్ ఆడాడు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలవడంలో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 28 వికెట్లతో సత్తా చాటి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. తాజాాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా వన్డే ప్రపంచకప్ 2027 జట్టు గురించి మాట్లాడిన అశ్విన్.. సౌతాఫ్రికా కండిషన్స్‌కు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడ్డాడు.

దేశవాళీ క్రికెట్ ఆడాలి..
వెంటనే భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకొని మెగా టోర్నీకి సిద్దం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ను అశ్విన్ కోరాడు. దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడి భువనేశ్వర్ కుమార్ కూడా ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని అతనికి సలహా ఇచ్చాడు.
'సౌతాఫ్రికా కండిషన్స్‌లో భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్ టీమిండియాకు అవసరం. అతని అనుభవం జట్టుకు కలిసొస్తుంది. అతను వెంటనే ఫస్ట్ క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నీలు ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలి. సౌతాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఆడేందుకు సిద్దం కావాలి.'అని అశ్విన్ పేర్కొన్నాడు.
పంత్‌కు నో ఛాన్స్..
అశ్విన్ ఎంపిక చేసిన జట్టులో రిషభ్ పంత్, సంజూ శాంసన్, మహమ్మద్ షమీతో పాటు వాషింగ్టన్ సుందర్‌లకు అవకాశం కల్పించలేదు. అదే విధంగా కుర్రాళ్లైన వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, శివమ్ దూబే, రవిబిష్ణోయ్‌లను తీసుకోలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్‌లకు మాత్రం అవకాశం దక్కవచ్చని పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను తప్పకుండా వన్డే ప్రపంచకప్ ఆడాల్సిందేనని అశ్విన్ తెలిపాడు. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసిన అశ్విన్.. రెండో కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంచుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

