Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాలోనే అతను అత్యుత్తమ కోచ్: అశ్విన్

టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌పై రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియాలోనే అతను సూపర్ స్టార్ కోచ్ అని కొనియాడాడు. దిలీప్ కారణంగానే టీమిండియా స్లిప్ ఫీల్డింగ్ మెరుగైందని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది.

చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్‌లో రోహిత్ సేన 280 పరుగులు భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఆల్‌రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో సెంచరీ చేసిన అశ్విన్.. బౌలింగ్‌లో 6 వికెట్లు తీసాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్‌ పనితీరును ప్రశంసించాడు.

R Ashwin says T Dilip is a superstar coach he has helped improve our slip fielding

'ఫీల్డింగ్ గురించి మాట్లాడితే.. ముందుగా మనం దిలీప్ సర్ గురించి మాట్లాడుకోవాలి. మా ఫీల్డింగ్ గురించి మేం గూగుల్‌లో సెర్చ్ చేశాం. అతను పూర్తిగా ఇంటర్నెట్ పర్సనాలిటీగా మారాడు. ఇది చాలా అన్యాయం. అతను ఇంటర్నెట్ పర్స్‌నాలిటీ కాదు. దిలీప్ మా సెలెబ్రిటీ ఫీల్డింగ్ కోచ్. ఓ సూపర్ స్టార్.
కొన్నేళ్ల క్రితం మాకు స్లిప్ క్యాచింగ్ ఓ సవాల్‌గా ఉండేది.

గతేడాదిగా యశస్వి జైస్వాల్ స్లిప్ క్యాచ్‌ల విషయంలో చాలా మెరుగయ్యాడు. సౌతాఫ్రికా సిరీస్ నుంచి అతను అద్భుతమైన క్యాచ్‌లు తీసుకుంటున్నాడు. తాజా మ్యాచ్‌లోనూ సెకండ్ స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. సెకండ్ స్లిప్‌లో కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫీల్డర్. రాహుల్‌ను రిప్లేస్ చేసే సత్తా జైస్వాల్‌కు ఉంది.

స్లిప్ క్యాచ్‌ల విషయంలో ఈ ఇద్దరూ చాలా కష్టపడ్డారు. క్లోజింగ్ క్యాచింగ్, షార్ట్ లెగ్‌ క్యాచ్‌లు అందుకోవడం చాలా కష్టం. ఈ ప్లేస్‌లో ఫీల్డింగ్ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపరు. కానీ జైస్వాల్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. అద్భుతమైన క్యాచ్‌లు అందుకుంటున్నాడు. భారత ఫీల్డర్ క్యాచ్‌లు మెరుగ్వడానికి ప్రధాన కారణం దిలీప్ సరే'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

రాహల్ ద్రవిడ్ హెడ్ కోచ్ ఉన్న సమయంలో ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన టీ దిలీప్.. భారత ఫీల్డింగ్ ప్రమాణాలను పెంచాడు. మెగా టోర్నీల సందర్భంగా బెస్ట్ క్యాచ్‌లకు మెడల్స్ అందజేసే కార్యక్రమం చేపట్టి ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు. ఫీల్డింగ్ కోచ్‌గా అతను చేసిన హార్డ్ వర్క్ టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2024 అందుకునేలా చేసింది.

సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్‌పై అసాధారణ క్యాచ్ అందుకొని భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దాంతోనే గౌతమ్ గంభీర్ కూడా టీ దిలీప్‌నే ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగిస్తున్నాడు. టీమిండియా వచ్చే నాలుగు నెలల్లో మరో 9 టెస్ట్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల్లో స్లిప్ క్యాచ్‌లు కీలకంగా మారనున్నాయి.

Story first published: Sunday, September 22, 2024, 20:11 [IST]
Other articles published on Sep 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+