పాపం సర్ఫరాజ్‌ఖాన్.. సెలెక్టర్ల బాక్స్ బద్దలు కొట్టినా ఎంపికవ్వలేదు: రవిచంద్రన్ అశ్విన్

న్యూఢిల్లీ: టీమిండియా దేశవాళీ స్టార్, ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. గత మూడు సీజన్లుగా రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ నిలకడగా రాణిస్తున్నాడని, విధ్వంసకర బ్యాటింగ్ సెలెక్టర్ల డోర్లు బద్దలు కొట్టాడని తెలిపాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్‌కు జాతీయ జట్టులో చోటు దక్కడం లేదు.
ఆస్ట్రేలియాతో స్వదేశంలో టెస్టు సిరీస్‌కు ఎంపికవుతాడని ఆశలు పెట్టుకుంటే.. ఇషాన్ కిషన్ అరంగేట్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెలక్టర్లు.. సర్ఫరాజ్‌కు మొండిచేయి చూపారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సర్ఫరాజ్ సూపర్ బ్యాటింగ్..
ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. సెలెక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.'సర్ఫరాజ్ ఖాన్ గురించి ఏమని, ఎక్కడని మొదలుపెట్టను? సర్ఫరాజ్ ఖాన్... అతను టీమిండియాకు సెలక్ట్ అవుతాడా? కాడా? అన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, తనకు ఇవేమీ పట్టవు.
సర్ఫరాజ్ 2019-20 సీజన్‌లో 900 పరుగులు చేశాడు. 2020-21 సీజన్‌లోనూ 900 పరుగులు.ఇక ఈసారి సుమారుగా 600 రన్స్. తన అత్యద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

సెలెక్టర్లకు తలనొప్పిలా..
రంజీల్లో అతని ఆటతీరును కొనియాడుతూ ఆకాశానికెత్తాడు. వాళ్లకు కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. కోపం కూడా తెప్పిస్తున్నాడంటూ తనదైన శైలిలో బీసీసీఐ సెలక్టర్లపై సెటైర్లు వేశాడు. 'గత మూడు రంజీ సీజన్లలో అతని స్ట్రైక్‌రేటు బాగుంది. సగటు 100కి పైగా ఉంది. ప్రతి సీజన్‌లోనూ మెరుస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం సెలక్షన్ కమిటీ డోర్లను బాదడం కాదు. సెలక్టర్లకు ఓ రకంగా కోపం తెప్పించేలా తలనొప్పిలా తయారయ్యాడు.
కానీ దురదృష్టవశాత్తూ ఈసారి కూడా తను జట్టుకు ఎంపిక కాలేదు. అయితేనేం, తన ఆట తనది. దేనికి కుంగిపోకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ తన పని తాను చేసుకుపోయాడు. ముఖ్యంగా ఢిల్లీ మ్యాచ్‌లో తన బ్యాటింగ్ అద్భుతం. ముంబై ఆ మ్యాచ్‌లో ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మర్చిపోలేం'' అని అశ్విన్ కొనియాడాడు.

సర్ఫరాజ్‌కు బదులు సూర్య..
సర్ఫరాజ్ ఖాన్‌కు బదులు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌కు అవకాశం దక్కింది. అయితే దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వాల్సిందని సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. గత మూడు రంజీ సీజన్లలో అతని యావరేజ్ 100కిపైగా ఉండటం గమనార్హం.
ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే మూడో సెంచలు నమోదు చేశాడు. హైదరాబాద్‌పై 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ముంబై క్రికెటర్.. తమిళనాడుపై 162, ఢిల్లీతో 125 పరుగులు చేశాడు. ఈ ముంబై క్రికెటర్ రంజీ ట్రోఫీలో గత 23 ఇన్నింగ్స్‌ల్లో 10 శతకాలు నమోదు చేయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications