Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్ డిఫెన్స్ అద్భుతం: అశ్విన్

టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. రిషభ్ పంత్ డిఫెన్స్ అద్భుతంగా ఉంటుందని కొనియాడాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ డిఫెన్సివ్ టెక్నిక్ కలిగిన ప్లేయర్ రిషభ్ పంత్ అని అభిప్రాయపడ్డాడు.

ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ‌లో రిషభ్ పంత్ పర్వాలేదనిపించాడు. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం టీ20 తరహా బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిర్లక్ష్యపు షాట్‌తో ఔటైన పంత్‌పై విమర్శలు రాగా.. రెండో ఇన్నింగ్స్‌పై ప్రశంసల జల్లు కురిసింది. తాజాగా రిషభ్ పంత్ బ్యాటింగ్ గురించి మాట్లాడిన అశ్విన్ అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు.

R Ashwin says Rishabh Pant s as one of the best in terms of defence in Test cricket

'రిషభ్ పంత్‌కు ఏం చేయాలనేది సరైన పద్దతిలో చెప్పాలి. ఆస్ట్రేలియా పర్యటనలో మరిన్ని పరుగులు చేయలేకపోయాడు. కానీ అందరిలా కాకుండా మెరుగైన ఇన్నింగ్స్‌తో ఆసీస్ పర్యటనను ముగించాడు. ఇప్పటికీ రిషభ్ పంత్ అసలు సామర్థ్యం బయటకు రాలేదు. అతను అన్ని రకాల షాట్లను ఆడగలడు.

స్వీప్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, అప్పర్ కట్‌.. ఇలా ప్రతీ షాట్ ఆడగలడు. అయితే ఇవన్నీ హై రిస్క్ షాట్లు. అయినా అలవోకగా ఆడేస్తాడు. రిషభ్ పంత్ డిఫెన్సివ్ మోడ్‌లో 200 బంతులు ఎదుర్కొంటే ప్రతీ మ్యాచ్‌లోనూ సెంచరీ చేయగలడు. అందుకే ఎప్పుడు దూకుడుగా ఆడాలి. ఎక్కడ డిఫెన్స్ ఆడాలనేది అతనికి తెలుసు. కానీ, ఆ రెండింటిని సరిగ్గా సమన్వయం చేస్తేనే ఫలితం సానుకూలంగా ఉంటుంది.

సిడ్నీ టెస్ట్‌లో పంత్ రెండు రకాల ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో నిదానంగా ఆడుతూ 40 పరుగులు చేశాడు. కానీ, ఫీల్డర్‌ను చూసుకోకుండా తనదైన షాట్ ఆడి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దాంతో అందరూ అతన్ని కొనియాడారు. తొలి ఇన్నింగ్స్‌ గురించి మరిచిపోయారు.

అదే సమయంలో పంత్ దూకుడును అర్థం చేసుకోవాలి. చాలా తక్కువ సందర్భాల్లోనే పంత్ డిఫెన్స్ ఆడుతూ ఔటవుతాడు. ఎంతటి ఫాస్టెస్ట్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నా పంత్.. చాలా నింపాదిగా బ్యాటింగ్ చేస్తాడు. అది అతని ప్రత్యేకం. పంత్ 10 బంతులను ఆడుతూ ఔటైనట్లు చూపిస్తే నా పేరు మార్చుకుంటా'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, January 10, 2025, 21:50 [IST]
Other articles published on Jan 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+