Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అడిగి తెచ్చుకునేది గౌరవం కాదు.. ఒక్క మ్యాచ్‌ గెలిచినందుకే.. రమీజ్ రాజాకు అశ్విన్ చురకలు..!

R Ashwin says Respect for opposition doesnt come with victory and defeatover Ramiz Raza comments

న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రెసిడెంట్ రమీజ్ రాజాకు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చురకలంటించాడు. అడిగి తెచ్చుకునేది గౌరవం కాదని కౌంటరిచ్చాడు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్.. టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఐసీసీ మెగా టోర్నీలో భారత్‌ను ఓడించడం పాక్‌కు ఇదే తొలిసారి. దాంతో ఈ విజయాన్ని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు మరిచిపోవడం లేదు.
వరుస పరాజయాల తర్వాత దక్కిన ఈ విజయానికి మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనంటూ పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందే..

మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందే..

'ఐసీసీ టోర్నీల్లో భారత్‌తో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్థాన్ అండర్ డాగ్‌గానే ఉండేది. ఒత్తిడి తీసుకొని భారత్‌తో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో భారత్‌ను ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది. టీమిండియాను ఓడించలేమని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. అయితే గత వరల్డ్ కప్‌లో దాన్ని సాధించాం. టీమిండియాను ఓడించి అద్భుతం క్రియేట్ చేశాం. అది అనుకోకుండా వచ్చిన విజయమే కావచ్చు కానీ అందులో మాకు క్రెడిట్ దక్కాల్సిందే... ఎందుకంటే టీమిండియా బిలియన్ డాలర్ టీమ్ క్రికెట్ ఇండస్ట్రీ.'అంటూ రమీజ్ రాజా కామెంట్ చేశాడు.

గెలుపు ఓటములు సహజం..

గెలుపు ఓటములు సహజం..

ఈ వ్యాఖ్యలపై అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ఓ క్రికెటర్‌గా రమీజ్ రాజా ఇలా మాట్లాడాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. 'రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా. ఈ విషయాన్ని డీల్ చేసే విధానం ఇదేనా? క్రికెట్ గేమ్‌లో గెలుపు ఓటములు సహజం. పొలిటికల్ టెన్షన్స్ కారణం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ ఆసక్తి వేరుగా ఉంటుంది. రెండు జట్ల మధ్య మ్యాచ్‌లా కాకుండా రెండు దేశాల మధ్య పోరాటం చూస్తారు చాలా మంది. అయితే ఓ క్రికెటర్‌గా ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి కూడా అంతే అనే విషయం నాకు బాగా తెలుసు. అందులోనూ టీ20ల్లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం.

అడిగి తెచ్చుకునేది కాదు..

అడిగి తెచ్చుకునేది కాదు..

క్రెడిట్ కానీ, గౌరవం కానీ అడిగి తీసుకుంటే వచ్చేది కాదు. గెలుపు ఓటములతో గౌరవం దక్కదు. ప్రత్యర్థితో మనం ఎలా ఉంటున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం.. అనేదాన్ని బట్టి గౌరవం దక్కుతుంది. ఓ క్రికెటర్‌గా, నా ప్రత్యర్థి జట్టును నేను గౌరవిస్తా, అది పాకిస్థాన్ అయినా కావచ్చు, అఫ్గానిస్తాన్ అయినా కావచ్చు. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది.' అని అశ్విన్ చాలా హుందాగా చురకలంటిచ్చాడు.

Story first published: Monday, October 10, 2022, 22:30 [IST]
Other articles published on Oct 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+