Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ఆడటంపై అశ్విన్ ఏమన్నాడంటే..?

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఐపీఎల్ ఆడటంపై క్లారిటీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. ఆటగాడిగా తన కెరీర్ ముగియలేదన్నాడు. వీలైనంత ఎక్కువ కాలం ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

బుధవారమే స్వదేశం బయల్దేరిన అశ్విన్.. ఇవాళ భారత్‌కు చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో అశ్విన్‌కు ఘన స్వాగతం లభించింది. బ్యాండ్ బాజా మధ్య అశ్విన్‌ను ఇంట్లోకి ఆహ్వానించిన కుటుంబ సభ్యులు అతన్ని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు అతనిపై పూల వర్షం కురిపించారు. కొందరు ఆటోగ్రాఫ్‌లు తీసుకోగా మరికొందరు సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.

R Ashwin Says I have zero regrets want to play for CSK as long as possible

టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం దక్కనందుకు పశ్చాతాపపడుతున్నారా? అని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు. 'కెప్టెన్సీ చేయనందుకు నాకు ఎలాంటి బాధ లేదు. నా వరకు ఈ రిటైర్మెంట్ పెద్ద నిర్ణయమే కాదు. ఇంత మంది నాకు స్వాగతం పలుకుతారని ఊహించలేదు. ఎలాంటి హడావుడి లేకుండాఇంట్లోకి వెళ్లాలనుకున్నా. కానీ మీరంతా నాకు ఘన స్వాగతం పలికారు.

2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇలానే స్వాగతం పలికారు. ప్రస్తుతం నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోలేదు. ఐపీఎల్ కోసం ఆతృతగా ఉన్నాను. నేను సీఎస్‌కే తరఫున ఆడబోతున్నా. వీలైనంత ఎక్కువ కాలం చెన్నై తరఫున ఆడేందుకు ప్రయత్నిస్తా. క్రికెటర్‌గా నా కెరీర్ ముగియలేదు. భారత ఆటగాడిగా.. అంతర్జాతీయ క్రికెట్‌కు మాత్రమై వీడ్కోలు పలికాను.'అని అశ్విన్ తెలిపాడు.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ. 9.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. చెన్నైతోనే కెరీర్ ప్రారంభించిన అశ్విన్.. కెరీర్ ముగింపు దశలో మళ్లీ ఆ జట్టులోనే చేరాడు.

Story first published: Thursday, December 19, 2024, 14:29 [IST]
Other articles published on Dec 19, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+