Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్ మామ చాలా కూల్.. ద్రవిడ్‌లా కఠినం కాదు: అశ్విన్

టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. గంభీర్ చాలా రిలాక్స్‌గా ఉండే హెడ్ కోచ్ అని చెప్పుకొచ్చాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహభరితమైన వాతావరణాన్ని నెలకొల్పడాని, అతన్ని ఎవ్వరైనా ఇష్టపడాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో గంభీర్ ఆటగాళ్లకు అత్యంత ఇష్టమైన కోచ్‌గా గుర్తింపుపొందుతాడని జోస్యం చెప్పాడు.

రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ భారత్ గెలవడంలో ఆల్‌రౌండర్‌గా అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. సొంతగడ్డపై బ్యాటింగ్‌లో శతకం బాదిన అశ్విన్.. బౌలింగ్‌లో 6 వికెట్లు తీసాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కాగా.. తన ప్రయాణాన్ని విజయంతో మొదలుపెట్టాడు.

R Ashwin says Coach Gautam Gambhir is a relaxed rancho everybody will love him

తాజాగా తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. హెడ్ కోచ్‌గా గంభీర్, రాహుల్ ద్రవిడ్ మధ్య ఉన్న తేడాలను వివరించాడు. ఈ ఇద్దరూ ప్రభావంతమైన కోచ్‌లను కొనియాడాడు. 'గౌతమ్ గంభీర్ చాలా రిలాక్స్‌గా ఉండే కోచ్. అతన్ని నేను రిలాక్స్‌డ్ రాంకో అని పిలుస్తాను. ఎలాంటి ఒత్తిడి పెట్టడు. ఉదయం టీమ్ సమావేశంలోనూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. కాస్త ఆలస్యంగా వచ్చినా.. రండి అని కూల్‌గా ఆహ్వానిస్తాడు.

రాహుల్ భాయ్ మాత్రం అన్నీ సక్రమంగా ఉండేలానేవాడు. ఏ సమయంలో బాటిల్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అతను చాలా కఠినంగా ఉండేవాడు. వస్తువులన్నీ సక్రమంగా ఉండాలనేవాడు. గంభీర్ మాత్రం ఇలా చేయడం లేదు. చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు. అతను ప్రజల మనిషి. ప్రతీ ఒక్కరి హృదయాలను గెలుస్తాడు. కుర్రాళ్ల ప్రేమను కూడా గెలుచుకుంటాడని అనుకుంటున్నా.

రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్. ప్రతీ ఒక్కరితో కలిసి పనిచేస్తాడు. అతను సారథ్య బాధ్యతల స్వీకరించినప్పటి నుంచి చూస్తున్నాం.. కెప్టెన్‌గా అతను చాలా ప్రశాంతంగా.. ఒదిగి ఉంటున్నాడు.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ముగియగా.. గౌతమ్ గంభీర్ ఆ బాధ్యతలు చేపట్టాడు. శ్రీలంక పర్యటనలోని టీ20 సిరీస్‌తో హెడ్ కోచ్‌గా తన పనిని మొదలు పెట్టిన గంభీర్.. టీ20 సిరీస్ విజయంతో తన టర్మ్‌ను ఘనంగా ప్రారంభించాడు. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో ఓటమి ఏదుర్కొన్నాడు. టెస్ట్‌ ఫార్మాట్‌లో మాత్రం విజయం సాధించాడు.

Story first published: Monday, September 23, 2024, 21:57 [IST]
Other articles published on Sep 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+