Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే అతనికి క్యారమ్ బాల్ వేసాను: అశ్విన్ (వీడియో)

పిచ్ భిన్నంగా ఉండటంతోనే క్యారమ్ బాల్‌తో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్‌కు చెక్ పెట్టానని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో అశ్విన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

అశ్విన్‌కు తోడుగా జడేజా 4 వికెట్లతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. అశ్విన్ బౌలింగ్‌లో గ్లేన్ ఫిలిప్స్ రెండు భారీ సిక్స్‌లు బాది.. అతని క్యారమ్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

R Ashwin Reveals Why He Used Carrom Ball To Dismiss Glenn Phillips During IND vs NZ 3rd Test

రెండో రోజు ఆట అనంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన అశ్విన్.. క్యారమ్ బాల్ వేయడానికి గల కారణాన్ని వివరించాడు. 'పిచ్ చాలా భిన్నంగా ఉంది. ఓవైపు ఫ్లాట్‌గా ఉంటే మరోవైపు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్ సైడ్ నుంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతి ఈజీగా బ్యాట్‌పైకి వెళ్తోంది. బౌన్స్ ఏ మాత్రం లేదు. దాంతోనే మరోసైడ్‌ను ఎక్కువగా ఉపయోగించుకున్నాను.

బ్యాటర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించి నాపై ఎదురుదాడికి దిగారు. దాంతోనే నేను విభిన్నంగా బౌలింగ్ చేయాలనుకొని క్యారమ్ బాల్ వేసాను. ఇక డారిల్ మిచెల్ క్యాచ్‌ను ఎలాగైన పట్టాలనే కసితో ప్రయత్నించాను. ముందుగా ఆ క్యాచ్ వదిలేస్తానేమోనని అనుకున్నా. కానీ బంతికి దగ్గరగా వెళ్లినప్పుడు క్యాచ్ పట్టగలననే విశ్వాసం కలిగింది. నా పెద్ద చేతులు కూడా ఈ క్యాచ్ పట్టేందుకు సహకరించాయి.

మా ముందు ఉన్న టార్గెట్ పెద్దదేం కాదు. మరో రెండు మూడు పరుగులకు న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేయాలి. ఈ ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు కట్టడి చేస్తే మాకు అంత మంచిది. అయితే ఈ లక్ష్యాన్ని చేధించడం అంత సులువు కాదు. మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయాలి. ముంబై పిచ్‌లో నేను మరింత వేగాన్ని, బౌన్స్‌ను అంచనా వేసాను. కానీ ఈ పిచ్ మరి స్లోగా ఉంది. ఇది సాధారణ ముంబై తరహా పిచ్ కాదు. చాలా నెమ్మదిగా ఉంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

సంక్షిప్త స్కోర్లు:

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 235 ఆలౌట్

భారత్ తొలి ఇన్నింగ్స్ 263 ఆలౌట్

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 171/9

Story first published: Saturday, November 2, 2024, 18:12 [IST]
Other articles published on Nov 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+