Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఆసీస్ హిట్టర్‌ను తీసుకోమని చెబితే పట్టించుకోలేదు: అశ్విన్

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆస్ట్రేలియా పవర్ హిట్టర్ టీమ్ డేవిడ్‌ను తీసుకోవాలని ఫ్రాంచైజీలకు సూచించానని, కానీ తన మాటను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదని మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. టీమ్ డేవిడ్ ఫామ్‌లో లేడని, అతని ఆట దిగజారుతుందని ఫ్రాంచైజీలు అతన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదన్నాడు. ఆర్‌సీబీ మాత్రం రూ. 3 కోట్లకే ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మెగా వేలం గురించి మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఫ్రాంచైజీలకు నేను కొన్ని విషయాలపై సూచనలు చేశా. ముఖ్యంగా టీమ్ డేవిడ్‌ను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని ఫ్రాంచైజీలకు చెప్పా. కానీ ఫ్రాంచైజీలు మాత్రం టీమ్ డేవిడ్ ఫామ్‌లో లేడని పట్టించుకోలేదు. టీ20ల్లో ఎత్తైన బ్యాటర్లదే హవా. వైడ్ లైన్‌లో ఎటువంటి మార్పులు తీసుకురాకపోతే వారే రాజ్యమేలుతారు. ఆర్‌సీబీ టీమ్ డేవిడ్‌ను తక్కువ ధరకే దక్కించుకొని ప్రయోజనం పొందింది. ఇప్పడు ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమ్ డేవిడ్‌ను ముందుకు పంపిస్తోంది. ఇది వచ్చే సీజన్‌లో ఆర్‌సీబీకి కలిసి రానుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

R Ashwin Reveals His Suggestion to Sign Aussie Star Tim David Was Denied by IPL Teams

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున టీమ్ డేవిడ్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. తనకే సాధ్యమైన పవర్ హిట్టింగ్ మ్యాచ్ ఫలితాలనే తారుమారు చేశాడు. ఈ సీజన్‌లో 101 బంతులు మాత్రమే ఆడిన టీమ్ డేవిడ్ 187 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అదే జోరును కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో 265 పరుగులు చేశాడు.

Story first published: Thursday, August 14, 2025, 10:37 [IST]
Other articles published on Aug 14, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+