For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డ్రెస్సింగ్ రూమ్‌లో అశ్విన్ చివరి ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ, సిరాజ్! (వీడియో)

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో చివరిసారిగా మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అశ్విన్ చివరి ప్రసంగంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకున్నారు. మరోవైపు అశ్విన్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు.

ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ అనంతరం అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

R Ashwin retirement Virat Kohli and Mohammed Siraj got emotional during the last speech of India great

ఆకస్మాత్తుగా అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ షాక్‌కు గురిచేసింది. ఇక రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్‌కు మాజీ క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు. జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇక అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటన నుంచి భారత డ్రెస్సింగ్ రూమ్‌లో చివరి ప్రసంగం వరకు ఉన్న ఓ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.

R Ashwin retirement Virat Kohli and Mohammed Siraj got emotional during the last speech of India great

ఈ వీడియోలో అశ్విన్ మీడియా సమావేశం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ తమ ఆటగాళ్లతో సంతకం చేసిన జెర్సీని కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి బహుకరించాడు. ఆసీస్ మాజీ ప్లేయర్ మాథ్యూ హెడెన్ కూడా అశ్విన్‌ను అభినందించాడు. ఆ తర్వాత అశ్విన్ తన సహచర ఆటగాళ్ల ముందు భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉద్వేగభరితంగా మాట్లాడాడు.

'2011-12లో తొలిసారి ఆస్ట్రేలియాలో పర్యటించాను. అదే నా తొలి ఆసీస్ టూర్. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌తో పాటు ఇతర దిగ్గజాలు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఈ రోజు నా సమయం వచ్చింది. ఈ టూర్‌ను బాగా ఆస్వాదించాను. గత ఐదేళ్లుగా జట్టులోని ఆటగాళ్లతో చాలా సన్నిహితంగా ఉన్నాను.

R Ashwin retirement Virat Kohli and Mohammed Siraj got emotional during the last speech of India great

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్నా.. నాలోని క్రికెట్‌కు రిటైర్మెంట్ లేదు. చెన్నైకి వెళ్లిపోయినా.. మెల్ బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్‌ను చూస్తాను. మీలో ఎవరికైనా నా అవసరం పడితే ఒకే ఒక్క కాల్ చేయండి. తప్పకుండా స్పందిస్తాను. గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ప్రత్యేక ధన్యవాదాలు'అని అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు. అశ్విన్ ప్రసంగంతో కోహ్లీ, సిరాజ్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

Story first published: Thursday, December 19, 2024, 11:55 [IST]
Other articles published on Dec 19, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+