అతను అద్భుతమైన బౌలర్.. సరైన ఎంపికే! కానీ సుందర్ పాత్ర ఏంటి: అశ్విన్
భారత టెస్ట్ టీమ్‌లో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ సరాన్ష్ జైన్‌పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతను అద్భుతమైన బౌలర్ అని, టెస్ట్ టీమ్‌లోకి తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పాడు.
రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో 33 ఏళ్ల సరాన్ష్ జైన్‌కు అవకాశం దక్కింది. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో సరాన్ష్ జైన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. మురళీ విజయ్, మహమ్మద్ షమీ తర్వాత ఐపీఎల్ కాంట్రాక్ట్ లేకుండా భారత జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సరాన్ష్ జైన్ నిలిచాడు.

నేను ముందే ఊహించాను..
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా సరాన్ష్ జైన్ గురించి మాట్లాడిన అశ్విన్.. అతని బౌలింగ్ తీరును వివరిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు. 'సరాన్ష్ జైన్‌కు టీమిండియాలో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉంది. అతని బౌలింగ్‌ను నేను చూశాను. అతనిపై నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. క్రీజ్‌కు దూరంగా బౌలింగ్ చేస్తాడు. అటాకింగ్ చేస్తాడు. అతనో విభిన్నమైన ఆఫ్ స్పిన్నర్. వికెట్లు తీయడమే అతని పని.
ఇటీవల అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అతనికి అవకాశం వస్తుందని నేను ముందే ఊహించాను. అయితే తుది జట్టులో చోటు దక్కుతుందా? లేదా అనేది చూడాలి. మానవ్ సుతార్, జడేజా, కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగితే సరాన్ష్ జైన్ బెంచ్‌కే పరిమితం కావచ్చు. కానీ అతనికి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే భారత్ తరఫున రాణించగల సత్తా అతనికి ఉంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
మా సుందరం పాత్ర ఏంటి?: ఆర్ అశ్విన్
జట్టులో వాషింగ్టన్ సుందర్ పాత్ర ఏంటో చెప్పాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను అశ్విన్ ప్రశ్నించాడు. 'వాషింగ్టన్ సుందర్ ప్రదర్శన కూడా బాగుంది. కానీ టెస్ట్ క్రికెట్‌లో సుందర్ పాత్ర ఏంటి? అతను అద్భుతమైన బ్యాటర్.. కాదనలేను. అదే సమయంలో మంచి స్పిన్నర్ కూడా. కానీ భారత్ మేనేజ్‌మెంట్ సుందర్ తొలి పాత్ర ఏంటో నిర్ణయించి అతనికి చెప్పాలి. అతను టాప్ సిక్స్ బ్యాటరా? లేక టాప్-4 బౌలర్లలో ఒకడా? అతను మ్యాచ్ గెలిపించగల బౌలర్.
అతను టాప్ సిక్స్‌లో బ్యాటింగ్ చేయాలి. నేనైతే అతన్ని టాప్ సిక్స్‌లో బ్యాటింగ్ చేయాలని చెబుతాను. అతని పాత్రను నిర్ణయించడం చాలా ముఖ్యం. ఒకవేళ భారత్ ఓడితే.. సుందర్ బ్యాటరా? బౌలరా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అతనిపై కూడా విమర్శలు వస్తాయి. కానీ నేను మాత్రం అతన్ని ఎలా వాడుకున్నారని నిలదీస్తాను.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

