టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌కు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతని బ్యాటింగ్ గణంకాలు ప్రస్తావిస్తూ ప్రశంసల జల్లు కురిపించాడు. ఏంటి తమ్మి.. ఈ విధ్వంసం సరిపోతుందా? లేక డోస్ పెంచుతావా? అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
అండర్ 19 ప్రపంచకప్ ముందు సౌతాఫ్రికాతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 11, 68, 127 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా మూడో యూత్ వన్డేలో 63 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ ఇన్నింగ్స్ ఫిదా అయిన అశ్విన్.. సోషల్ మీడియా వేదికగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. 14 ఏళ్ల వయసులోనే ఈ విధ్వంసం ఏంటని ఆశ్చర్యపోయాడు. ఐపీఎల్‌లో వైభవ్ విధ్వంసం చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

'171(95), 50(26), 190(84), 68(24), 108*(61), 46(25) & 127(74). గత 30 రోజుల్లో వైభవ్ సూర్యవంశీ దేశవాళీ, అండర్ 19 క్రికెట్‌లో సాధించిన స్కోర్లలో ఇవి కొన్ని మాత్రమే. ఏంటి తమ్ముడు? ఈ శాంపిల్ సరిపోతుందా? లేదా మరింత డోస్ పెంచబోతున్నావా? ఈ చిచ్చర పిడుగు 14 ఏళ్ల వయసులోనే ఎలా విధ్వంసం సృష్టిస్తున్నాడో మాటల్లో వర్ణించలేం.
అప్‌కమింగ్ అండర్ 19 వరల్డ్ కప్‌లో అతను అందరి దృష్టిని ఆకర్షించబోతున్నాడు. ఐపీఎల్‌లో సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేస్తూ ఓపెనర్‌గా తన తొలి పూర్తి సీజన్ ఆడనున్నాడు. వచ్చే నాలుగు నెలల పాటు అతని ఆటను చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను.'అని అశ్విన్ ఎక్స్‌వేదికగా పేర్కొన్నాడు.
గతేడాది ఐపీఎల్ చివరి సీజన్‌లో అరంగేట్రం చేసిన వైభవ్.. రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై సంచలన బ్యాటింగ్‌తో 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 2026 కోసం ఈ కుర్రాడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 1.10 కోట్లకు రిటైన్ చేసుకుంది. అతనిపై నమ్మకంతోనే సంజూ శాంసన్‌ను సీఎస్‌కేకు వదిలేసుకుంది.