Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్‌ను ఊరిస్తున్న వరల్డ్ రికార్డ్!

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. సౌతాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో అశ్విన్ మరో 11 వికెట్లు తీస్తే.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్‌గా చరిత్రకెక్కనున్నాడు.

ప్రస్తుతం అశ్విన్ 489 వికెట్లతో ఉన్నాడు. 94 మ్యాచ్‌ల్లో అతను ఈ వికెట్లను సాధించాడు. అశ్విన్ కన్నా ముందు అనిల్ కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. అతను 132 మ్యాచ్‌ల్లో 619 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 500 వికెట్ల క్లబ్‌లో చేరిన 9 బౌలర్‌గా అశ్విన్ నిలవనున్నాడు. అశ్విన్ కన్నా ముందు మురళీదరణ్(800), షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(690), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్(604), గ్లేన్ మెక్‌గ్రాత్(563), వాల్ష్(519), నాథన్ లియోన్(501) ఉన్నారు.

R Ashwin just 11 wickets away from the magical feat of 500 Test wickets

సౌతాఫ్రికాతో మంగళవారం జరిగే మ్యాచ్‌లో అశ్విన్ ఈ ఫీట్ సాధిస్తే వరల్డ్ రికార్డ్‌ను తన పేరిట లిఖించుకోనున్నాడు. అయితే ఈ మ్యాచ్ తుది జట్టులో అశ్విన్‌కు చోటు దక్కే అవకాశం లేదు. సెంచూరియన్ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడినా.. 11 వికెట్లు తీయడం అసాధ్యం. స్పిన్‌కు ఏ మాత్రం అనుకూలంగా ఉండని పిచ్‌పై అశ్విన్ ప్రభావం ఏ మాత్రం ఉండదు.

ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో అశ్విన్‌కు ఆడే అవకాశం దక్కితే మాత్రం ఈ ఫీట్ సాధించవచ్చు. సౌతాఫ్రికా పర్యటనలో ఈ ఫీట్ మిస్సైనా.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు. స్పిన్‌కు అనుకూలంగా ఉండే భారత్ పిచ్‌లపై అశ్విన్‌కు తిరుగుండదు.

భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ జరిగే సెంచూరియన్‌లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సెంచూరియన్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.

Story first published: Monday, December 25, 2023, 20:03 [IST]
Other articles published on Dec 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+