కోహ్లీ, రోహిత్‌ను టచ్ చేయలేరు.. మా బౌలర్ల పరిస్థితి వేరు : అశ్విన్
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టు నుంచి తొలగించలేరని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వారికున్న ట్రాక్ రికార్డ్, క్రేజ్ దృష్ట్యా సెలెక్టర్లు వారిని కనీసం టచ్ కూడా చేయలేరని అభిప్రాయపడ్డాడు. వారిని తొలగించే ప్రయత్నం చేసినా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తాయని చెప్పాడు.
ఇంగ్లండ్ పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన రోహిత్ శర్మను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తప్పించేందుకు సెలెక్టర్లు సిద్దమయ్యారని వార్తలు వచ్చాయి. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేనే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ అంటూ ప్రచారం జరిగింది. కానీ ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో చెలరేగి ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు.

టచ్ చేయలేరు..
తాజాగా రోహిత్ రిటైర్మెంట్‌పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. వారిని తప్పించేం ధైర్యం భారత సెలెక్షన్ కమిటీకి లేదని స్పష్టం చేశాడు. కానీ బౌలర్ల విషయంలో ఇలా ఉండదని తెలిపాడు. 'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలనుకుంటే వారిని ఎవరూ టచ్ చేయలేరు. ఎందుకంటే వారికి ఆ సత్తా ఉంది. వారు టన్నులకొద్ది పరుగులు చేశారు. ఇద్దరూ బ్యాటర్లే. వారిని టచ్ చేయలేరు. ఒకవేళ తొలగించే ప్రయత్నం చేసినా తీవ్ర విమర్శలు వస్తాయి.
రోహిత్ రిటైర్మెంట్ వార్తలను చూస్తే.. అది బయటి నుంచి వచ్చిన ప్రచారం కాదు. నిప్పు లేకపోతే పొగ రాదు. కానీ రోహిత్ పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో ఆడటం గురించి రోహిత్‌కు ఎలాంటి సందేహం లేదు.
మా బౌలర్ల పరిస్థితి భిన్నం..
రోహిత్, విరాట్ ఇద్దరినీ ఎవరూ టచ్ చేయలేరు. ఎందుకంటే వాళ్లిద్దరూ టాప్ క్లాస్ బ్యాటర్లు. వాళ్ల వెనుక అభిమాన సైన్యం, ఒక దళం ఉంది. వాళ్లను చూడటానికి జనాలు స్టేడియానికి వస్తారు. అలాంటి ఆటగాళ్లను జట్టు నుంచి తొలగిస్తే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది.
కానీ బౌలర్ల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్ బౌలర్లను జట్టు నుంచి తప్పించినప్పుడు.. బ్యాటర్ల విషయంలో వచ్చినంతగా ప్రజా వ్యతిరేకత రాదు. మహా అయితే ఓ 10 మంది అడుగుతారు. లేదంటే ఓ 1000 మంది ప్రశ్నిస్తారు. 10 వేల మంది అడిగినా.. ఎలాంటి ప్రయోజనం ఉండదు. భవిష్యత్తులో బౌలర్లకు కూడా ఇదే స్థాయి అభిమాన మద్దతు లభించాలని కోరుకుంటున్నా. బౌలర్ల ఎంపిక కూడా సెలెక్టర్లకు కష్టతరంగా మారాలని ఆశిస్తున్నాను.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

