Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్ వల్లే కుల్దీప్ యాదవ్ విఫలమయ్యాడు: అశ్విన్

టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి అతనికి సరైన మద్దతు లభించడం లేదని ఆరోపించాడు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్దీప్ యాదవ్‌ను ఏ మాత్రం నమ్మడం లేదని అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో తొలి టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్ తేలిపోయాడు.

గాలే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (1/65) ఒకే ఒక్క వికెట్ తీసిన కుల్దీప్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో (0/37) ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. మరోవైపు మానవ్ సుతార్ (4/76, 6/55) పది వికెట్లతో సత్తా చాటగా.. జడేజా(3/57, 1/71) నాలుగు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ ప్రభావం చూపకపోవడంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఆలస్యంగా బౌలింగ్ చేయించడంతోనే..

తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. కుల్దీప్ యాదవ్ వైఫల్యానికి గల కారణాలను వెల్లడించాడు. కుల్దీప్ యాదవ్ ఆత్మవిశ్వాసం లోపించిందని చెప్పాడు. అతనితో ఆలస్యంగా బౌలింగ్ చేయించడం వల్లే ప్రభావం చూపలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. మేనేజ్‌మెంట్ అతన్ని నమ్మడం లేదనిపిస్తోందన్నాడు. 'ఒకవైపు జడేజా, మరొకవైపు మానవ్ సుతార్ వికెట్లు తీశారు కాబట్టి జనాలు కుల్దీప్ యాదవ్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తారు. అందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే కుల్దీప్ యాదవ్ మూడో స్పిన్నర్.

R Ashwin Blames Shubman Gill for Kuldeep Yadav s Struggles in 1st Test Says He Must Bowl in First 30 Overs

నేను, జడేజా ఆడే సమయంలో కూడా కుల్దీప్ యాదవ్ మూడో స్పిన్నర్‌గానే ఉన్నాడు. ఇప్పటికే అదే పాత్రను పోషిస్తున్నాడు. మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా తుది జట్టులో ఆడటం అంత సులువు కాదు. భాగస్వామ్యం కొనసాగుతున్నప్పుడు దాన్ని విడదీసేందుకు ఒక బౌలర్‌ను తీసుకురావడం చాలా కష్టం. బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు. పైగా కూకబుర్రా బంతితో శ్రీలంకలో 30 ఓవర్ల తర్వాత బౌలింగ్ చేయడం చాలా కష్టం. బంతి పాతబడిన తర్వాత స్లోగా మారిపోతుంది. కుల్దీప్ యాదవ్ వేగంగా బౌలింగ్ చేసే స్పిన్నర్ కాదు.

జడేజాతోనే బౌలింగ్..

గత 10-15 ఏళ్లలో భారత్ టెస్ట్ క్రికెట్‌ను పరిశీలిస్తే.. బంతి పాతబడినప్పుడు జడేజానే ఎక్కువ బౌలింగ్ చేస్తాడనే విషయం అర్థమవుతుంది. ఎందుకంటే జడేజా హ్యాండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. వికెట్ స్లోగా మారినప్పుడు బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టేందుకు వేగంగా బౌలింగ్ చేసే బౌలర్ అవసరం. దాంతోనే కెప్టెన్లు జడేజాకు ప్రాధాన్యత ఇస్తారు.

మానవ్ సుతార్ కొత్త బంతితో బాగా బౌలింగ్ చేస్తాడు. కాబట్టి నిజాయితీగా చెప్పాలంటే కుల్దీప్ యాదవ్ రాణించాలంటే అతను కొత్త బంతితో తొలి 30 ఓవర్లలోనే బౌలింగ్ చేయాలి. అతనిని ఏ మాత్రం ఆలస్యంగా తీసుకురాకూడదు. అలాగే చిన్న చిన్న స్పెల్స్ వేస్తే స్పిన్నర్‌కు రిథమ్ దొరకదు. ఇప్పటికే అతని ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అతనికి జట్టు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యమని నేను ముందే చెప్పాను. ఆఖరి రోజు లంచ్ తర్వాత కేఎల్ రాహుల్.. కుల్దీప్ యాదవ్‌తోనే బౌలింగ్ చేయించాడు. అప్పుడు శుభ్‌మన్‌గిల్ మైదానంలో లేడు.

శుభ్‌మన్ గిల్‌ పట్టించుకోవడం లేదు..

శుభ్‌మన్ గిల్‌కు కుల్దీప్ యాదవ్ తొలి ప్రాధాన్యత కాదనే విషయం అర్థమవుతుంది. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అతనిపై నాకు పూర్తి సానుభూతి ఉంది. అతను ఏ మాత్రం నైపుణ్యం కోల్పోలేదు. చాలా కాలం బెంచ్‌పై కూర్చొని మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కూడా అతన్ని సరిగ్గా వాడుకోలేదు. ఇందులో అతని తప్పు ఏ మాత్రం లేదు. కుల్దీప్ యాదవ్‌లో ఇప్పటికీ నైపుణ్యం ఉంది. దానిని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అంతే తప్పా అతన్ని పక్కనపెట్టి ముందుకు సాగకూడదు. టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి అండగా నిలవాలి.

కుల్దీప్ యాదవ్‌‌తో ఆలస్యంగా బౌలింగ్ చేయించడమే అతనిపై మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. తదుపరి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టి సారాన్ష్ జైన్‌ను జట్టులోకి తీసుకువస్తారా? అంటే చెప్పలేం. కానీ మూడో స్పిన్నర్‌తో భారత్ ఆడాలనుకుంటే మాత్రం కుల్దీప్ యాదవ్‌తోనే కొనసాగాలి.'అని అశ్విన్ సూచించాడు.

Story first published: Thursday, August 20, 2026, 10:45 [IST]
Other articles published on Aug 20, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+