Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026 వేలంలో ఆ జట్టు అదరగొట్టింది: అశ్విన్

ఐపీఎల్ 2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) అదరగొట్టిందని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. వేలంలో చాలా తెలివిగా వ్యవహరించిన ఆర్‌సీబీ కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసిందని అభిప్రాయపడ్డాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో ఆర్‌సీబీ రూ.16.4 కోట్లతోనే 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇందులో టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ. 7 కోట్లకు తీసుకుంది. అండర్ 19 స్టార్ క్రికెటర్లు విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహాన్‌ను రూ.30 లక్షలకు తీసుకుంది.

తాజాగా వేలం గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. ఆర్‌సీబీ యాక్షన్ ప్లాన్‌ను కొనియాడాడు. 'వేలంలో ఆర్‌‌సీబీ అదరగొట్టింది. విహాన్ మల్హోత్రా, కౌశిక్ చౌహన్‌ను రూ.30 లక్షలకే సొంతం చేసుకుంది. ఈ విషయంలో ఆర్‌సీబీని అభినందించాల్సిందే. ఇది ప్రత్యేకమైన ప్రణాళిక. దీనిలో పెద్దగా పోటీ ఉండదు. కౌశిక్ చౌహాన్ అద్భుతాలు చేయనున్నాడు.

R Ashwin Applauds RCB s Brave Auction Strategy Ahead of IPL 2026

వేలంలో ఆర్‌సీబీకి అంత అదృష్టం ఎలా వచ్చింది? గతంలో వెంకటేశ్ అయ్యర్ కోసం వారు పూర్తి ప్రయత్నించారు. అప్పుడు కేకేఆర్ వెనుకడుగు వేసి ఉంటే ఆర్‌సీబీ వేలం అక్కడే ముగిసేది. కానీ ఈ సారి కేకేఆర్ పర్స్‌లో ఉబ్బు ఉన్నప్పటికీ .. ఆర్‌సీబీ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.7 కోట్లకు దక్కించుకోగలిగింది. ఆర్‌సీబీ మరోసారి అద్భుతమైన వేలం నిర్వహించింది.'అని అశ్విన్ పేర్కొన్నాడు.

ఆర్‌సీబీ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

వెంకటేష్ అయ్యర్ (రూ. 7 కోట్లు), జాకబ్ డఫీ (రూ. 2 కోట్లు), సాత్విక్ దేశ్వాల్ (రూ. 30 లక్షలు), మంగేష్ యాదవ్ (రూ. 5.2 కోట్లు), జోర్డాన్ కాక్స్ (రూ. 75 లక్షలు), విక్కీ ఓస్ట్వాల్ (రూ. 30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ. 30 లక్షలు), కనిష్క్ చౌహాన్ (రూ. 30 లక్షలు).

రిటైన్ లిస్ట్:

రజత్ పటీదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, జాకోబ్ బెతెల్, జోష్ హజెల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, నువాన్ తుషార, రసిక్ సలామ్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ.

Story first published: Friday, December 19, 2025, 16:38 [IST]
Other articles published on Dec 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+