Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్‌కు అశ్విన్ గుడ్‌బై!

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్.. తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఈ సమయంలో అశ్విన్ కాస్త భావోద్వేగానికి గురయ్యాడు.

R Ashwin announces retirement from international cricket

'నా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అంతర్జాతీయ క్రికెటర్‌గా నాకు ఇదే చివరి రోజు. ఆటగాడిగా నేను ఎన్నో మధుర జ్ఞాపకాలను సృష్టించాను. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న సీనియర్‌ ఆటగాళ్లలో మాదే చివరి గ్రూప్. నేను చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. బీసీసీఐతో పాటు నా సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు స్పెషల్ థ్యాంక్స్. భారత అంతర్జాతీయ క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. నేను క్లబ్ క్రికెట్ ఆడుతాను. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో నేను చాలా సరదాగా ఉండేవాడిని.

భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అనుకుంటున్నా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం సంతోషంగా ఉంది. 'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

పెర్త్ టెస్ట్ విజయం తర్వాతే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నాడని, కానీ తానే పింక్ బాల్ టెస్ట్ ఆడేలా కన్విన్స్ చేసానని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, తదుపరి రెండు టెస్ట్‌లు అతను ఆడడని వెల్లడించాడు. గురువారమే అశ్విన్ స్వదేశానికి వెళ్లిపోతాడని స్పష్టం చేశాడు.

2010 శ్రీలంక పర్యటనలో హరారే వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన అశ్విన్.. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్‌ టెస్ట్‌తో చివరి మ్యాచ్ ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అశ్విన్ 765 వికెట్లు తీసాడు.

టెస్ట్‌ల్లో 106 మ్యాచ్‌ల్లో 2.83 ఎకానమీతో 537 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 వికెట్ల ఘనతను 37 సార్లు అందుకున్నాడు. 116 వన్డేల్లో 4.93 ఎకానమీతో 156 వికెట్లుత తీసాడు. 65 టీ20ల్లో 6.90 ఎకానమీతో 72 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 4, 400 పరుగులు చేశాడు.

106 టెస్ట్‌ల్లో 25.75 సగటుతో 3503 పరుగులు చేసిన్ అశ్విన్.. 6 సెంచరీలతో పాటు 14 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అంతకుముందు డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Wednesday, December 18, 2024, 11:38 [IST]
Other articles published on Dec 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+