Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: శభాష్ నితీన్.. భారత్ పొగరు చూపించావ్! (వీడియో)

న్యూఢిల్లీ: భారత అంపైర్ నితీన్ మీనన్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ విశ్లేషకులు అభిమానులు నితీన్ మీనన్‌ను కొనియాడుతున్నారు. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో అంపైరింగ్ చేసే అవకాశం అందుకున్న నితీన్ మీనన్ తన మార్క్‌ను చూపించాడు.

నాలుగో టెస్ట్‌లో ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన నితీన్ మీనన్.. ఐదో టెస్ట్‌లో థర్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో నితిన్ మీనన్ సంచలన నిర్ణయంతో అందర్నీఆకట్టుకున్నాడు. రెండో సెషన్ ఆటలో స్టీవ్ స్మిత్ రనౌట్ విషయంలో హైడ్రామా చోటు చేసుకోగా.. నితిన్ మీనన్ అసాధారణమైన నిర్ణయం ప్రకటించి అందరి మన్ననలు అందుకున్నాడు.

Ashes 2023:

క్రిస్ వోక్స్ వేసిన 78వ ఓవర్‌లో స్టీవ్ స్మిత్ రనౌటయ్యాడు. ఈ ఓవర్ మూడో బంతిని వోక్స్ ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. మిడ్‌వికెట్ దిశగా ఆడిన స్మిత్ క్విక్ డబుల్‌కు ప్రయత్నించాడు. అయితే బంతిని అందుకున్న ఇంగ్లండ్ ఫీల్డర్ అంతేవేగంగా వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోకు అందించగా అతను రనౌట్ చేశాడు.

బంతి వికెట్లకు తాకే సమయానికి స్మిత్ క్రీజులోకి రాలేదు. దాంతో అందరూ రనౌటని భావించారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. స్మిత్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. కానీ థర్డ్ అంపైర్ నితీన్ మీనన్ తన నిర్ణయాన్ని వెల్లడించకుండా మరో కోణంలో రిప్లేలను పరిశీలించాడు. బెయిర్ స్టో వికెట్లను కొట్టినా బెయిల్స్ ఆలస్యంగా కిందపడటాన్ని నితీన్ మీనన్ గుర్తించాడు.

ఆ వెంటనే బెయిల్స్ కిందపడే సమయానికి స్మిత్ క్రీజులో బ్యాట్ పెట్టాడా? లేదా? అని క్షుణ్ణంగా పరిశీలించాడు. క్లారిటీ కోసం కాస్త సమయం తీసుకున్న నితీన్ మీనన్ చివరకు స్మిత్ నౌటౌటని ప్రకటించాడు. స్మిత్ క్రీజులో బ్యాట్ పెట్టే సమయానికి బెయిల్స్ కింద పడలేదని తెలిపాడు. దాంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న స్మిత్.. హాఫ్ సెంచరీతో ఆసీస్‌ను ఆదుకున్నాడు.

నితీన్ మీనన్ స్థానంలో మరే అంపైర్ ఉన్నా స్మిత్‌ను ఔటిచ్చేవాళ్లని, మరో కోణంలో అస్సలు చెక్ చేసేవారు కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. నితీన్ మీనన్‌ను సరైన నిర్ణయం తీసుకున్నాడని ప్రత్యేకంగా అభినందించాడు. ఆకాశ్ చోప్రాకూడా నితీన్ మీనన్ కఠిన నిర్ణయం తీసుకున్నాడని మెచ్చుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 283 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆసీస్ 295 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతూ.. భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. 22 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టానికి 113 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలీ(57 బ్యాటింగ్)తో పాటు బెన్ స్టోక్స్(9 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Saturday, July 29, 2023, 17:38 [IST]
Other articles published on Jul 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+