For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన క్వింటన్ డికాక్

న్యూఢిల్లీ: సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 30 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించాడు. 2021లోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతను తాజా వన్డేలు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు.

అంతర్జాతీయ టీ20లతో పాటు ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతానని స్పష్టం చేశాడు. క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఏ) ధృవీకరించింది. వన్డే ప్రపంచకప్‌ బరిలో నిలిచే జట్టును ప్రకటించిన కాసేపటికే డికాక్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడం అందర్నీ విస్మయపరిచింది.

Quinton de Kock Retirement

ఈ వ్యవహారంపై సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఈనాక్ ఎన్క్వే స్పందించాడు. సౌతాఫ్రికా జట్టుకు డికాక్ ఎంతో సేవ చేశాడని ప్రశంసించాడు. డికాక్ తన దూకుడైన బ్యాటింగ్‌తో ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడని కొనియాడాడు.

సౌతాఫ్రికా తరఫున 54 టెస్ట్‌లు, 140 వన్డేలు ఆడిన డికాక్... రెండు ఫార్మాట్లలో 9266 పరుగులు చేశాడు. వన్డేల్లో 44.85 సగట్టుతో 5966 రన్స్ నమోదు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలున్నాయి. 2013లో వన్డేక్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డికాక్.. 2016లో సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు నమోదు చేశాడు.

ఇప్పటి వరకు ఇదే అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. వికెట్ కీపర్‌గా 183 క్యాచ్‌లు 14 స్టంపింగ్‌లు చేశాడు. 8 వన్డేల్లో జట్టుకు సారథ్యం వహించి 4 విజయాలు అందించాడు. గత రెండు వన్డే ప్రపంచకప్‌ల్లో ఆడిన డికాక్.. 17 మ్యాచ్‌ల్లో 30 యావరేజ్‌తో 450 రన్స్ చేశాడు.

Quinton de Kock Retirement

అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండగా.. ఈ టోర్నీలో బరిలోకి దిగే సౌతాఫ్రికా జట్టును సీఏ మంగళవారం ప్రకటించింది. టెంబా సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.

సౌతాఫ్రికా ప్రపంచకప్ జట్టు:
టెంబా బవుమా(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్‌రమ్, రీజా హెండ్రీక్స్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జాన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్.

Story first published: Tuesday, September 5, 2023, 17:26 [IST]
Other articles published on Sep 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+