Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: ఐపీఎల్ ఫైనల్‌కు చేరలేకపోవడం సిగ్గుచేటు: విలియమ్సన్

Qualifier 2, DC vs SRH: Kane Williamson Says Real Shame not to make the IPL 2020 Final

అబుదాబి: ఐపీఎల్ 2020 ఫైనల్‌కు చేరలేకపోవడం చాలా సిగ్గుగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. గత మూడు వారాలుగా మా కుర్రాళ్లు గర్వించేలా ఆడారని ప్రశంసించాడు. ఐపీఎల్‌‌లో ప్రతి జట్టు బలమైందేనని, ఎవరు ఎవర్నైనా ఓడించొచ్చని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 17 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ భావోద్వేగం చెందాడు.

రిస్క్ తీసుకోవాలి

రిస్క్ తీసుకోవాలి

కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ... 'ఢిల్లీ క్యాపిటల్స్‌‌ చాలా మంచి జట్టు. కొన్ని రోజుల క్రితం, తక్కువ సమయంలో మేం ఎలా లయ దొరకబుచ్చుకున్నామో.. ఢిల్లీ ఆటగాళ్లు కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. మాపై ఢిల్లీ బాగా ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్‌కు దిగినప్పుడు రిస్క్ తీసుకోవాలి. మాకు శుభారంభం దక్కలేదు. కానీ మధ్యలో భాగస్వామ్యాలు నెలకొల్పగలిగాం. దాంతో మాకు కొద్దిగా విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఫైనల్ చేరలేకపోయాం' అని అన్నాడు.

సిగ్గుగా ఉంది

సిగ్గుగా ఉంది

'ఫైనల్‌కు చేరలేకపోవడం చాలా సిగ్గుగా ఉంది. అయితే గత మూడు వారాలుగా మా కుర్రాళ్లు గర్వించేలా ఆడారు. అందుకు సంతోషంగా ఉంది. ఇది మాకు మంచి సీజన్ అనే చెప్పాలి. చాలా మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ విజయానికి చేరువగా వచ్చి ఓడింది. బహుశా మేం అత్యుత్తమ ఆటతీరు కనబర్చలేకపోయాం. ఐపీఎల్‌‌లో ప్రతి జట్టు బలమైందే.. ఎవరు ఎవర్నైనా ఓడించొచ్చు. అలాంటప్పుడు బాగా ఆడాలి. టాప్-2లో ఉంటేనే ఉత్తమం. మా ఆటపై చర్చిస్తాం' అని విలియమ్సన్ తెలిపాడు.

గార్గ్ సూపర్

గార్గ్ సూపర్

'ఐపీఎల్ 2020లో హైదరాబాద్ తరఫున చాలా మంది కుర్రాళ్లు రాణించారు. టీ నటరాజన్, సందీప్ శర్మ, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్ బాగా రాణించారు. గార్గ్ నెట్స్‌లో చక్కటి షాట్లు ఆడుతున్నాడు. భవిష్యత్తులో అతడు తప్పకుండా అద్భుతమైన ఆటగాడవుతాడు' అని కేన్ విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం అండగా నిలిచిన అభిమానులకు విలియమ్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన చేస్తాం అని హామీ ఇచ్చాడు. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినప్పటికీ సన్‌రైజర్స్ విజయాన్ని అందుకోలేకపోయింది.

DC vs SRH: మైదానంలోకి హల్క్ బొమ్మను స్టోయినిస్ ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా?

Story first published: Monday, November 9, 2020, 13:00 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+