Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: మైదానంలోకి హల్క్ బొమ్మను స్టోయినిస్ ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా?

IPL 2020, DC vs SRH: The reason behind Marcus Stoinis carrying the hulk action figure

అబుదాబి: ఐపీఎల్‌ చరిత్రలో ఎనిమిదోసారి టాప్‌-2 జట్లే టైటిల్‌ పోరుకు అర్హత పొందాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్‌ సిద్ధంగా ఉంది. ఆదివారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఢిల్లీ 17 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా.. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ మార్కస్ స్టొయినిస్‌ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్‌ విలియమ్సన్‌ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాటం చేశాడు. స్టొయినిస్‌ (3/26), రబడ (4/29) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు.

క్వాలిఫయర్-2‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మార్కస్ స్టొయినిస్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం, అవార్డు అందుకునే సమయంలో స్టొయినిస్‌ హల్క్ బొమ్మను చేతిలో పట్టుకుని ఉన్నాడు. కేన్‌ విలియమ్సన్‌తో మాట్లాడుతున్న సమయంలో కూడా అతడు హల్క్ శైలిలోనే నిలబడ్డాడు. అయితే స్టొయినిస్‌ ఆ బొమ్మను తీసుకురావడానికి ఓ కారణం ఉంది. ప్రేరణ కోసమే హల్క్ బొమ్మను పట్టుకున్నాడట. వికెట్లు తీసిన తరువాత ఈ ఆసీస్ క్రికెటర్ కండలు చూపిస్తా సంబరాలు చేసుకుంటాడు. మార్వెల్ మూవీస్‌లోని ఫిక్షనల్ సూపర్ హీరో హల్క్. హల్క్ పాత్రకు ఈ ఆస్ట్రేలియా ఆటగాడు పెద్ద అభిమాని. కఠిన పరిస్థితుల్లో హల్క్ నుంచి స్టోయినిస్ స్ఫూర్తి పొందుతుంటాడు.

ఐపీఎల్ 2020లో మార్కస్ స్టొయినిస్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ‌అద్భుతంగా రాణిస్తున్నాడు. 12 వికెట్లతో పాటు 352 పరుగులు కూడా చేశాడు. ఢిల్లీ ఫైనల్ చేరడంలో స్టొయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లోనూ స్టొయినిస్ అదరగొట్టాడు. 38 రన్స్, మూడు వికెట్లు తీశాడు. స్టోయినిస్ ఫైనల్లో హల్క్‌ స్ఫూర్తితో మరోసారి చెలరేగి ఢిల్లీకి తొలి ఐపీఎల్ టైటిల్ అందింస్తాడో చూడాలి.

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ జట్టుకి ఓపెనర్‌గా వచ్చిన స్టోయినిస్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. మూడో ఓవర్‌లోనే జాసన్ హోల్డర్ క్యాచ్ వదిలేయడంతో జీవనదానం పొందిన స్టోయినిస్.. ఆ తర్వాత వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. దీంతో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. ఇక ఇన్నింగ్స్ 9వ ఓవర్‌ని రషీద్ ఖాన్‌‌‌తో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బౌలింగ్ చేయించగా.. ఆ ఓవర్‌లో రెండో బంతికే స్టాయినిస్‌ని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మిడిల్ స్టంప్‌ లైన్‌‌పై పడిన బంతి కొద్దిగా టర్న్ అవుతూ వెళ్లి ఆఫ్ స్టంప్‌ని గీరాటేసింది.

Story first published: Monday, November 9, 2020, 14:27 [IST]
Other articles published on Nov 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+