Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: విరాట్ కోహ్లీని కలిసిన పీవీ సింధు.. ఎందుకంటే..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు కలిసింది. ఆర్‌సీబీ టీమ్ బస చేసిన హోటల్‌కు వెళ్లిన సింధు.. విరాట్ కోహ్లీతో కలిసి సరదాగా ముచ్చటించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే విరాట్ కోహ్లీని పీవీ సింధు కలవడానికి గల కారణం ఏంటా? అనేది తెలియరాలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే పీవీ సింధు పెళ్లి పీటలు ఎక్కబోతుందని, కోహ్లీని ఆహ్వానించేందుకే అక్కడకు వెళ్లిందని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

PV Sindhu Meets Virat Kohli at Team Hotel Ahead of RCB vs CSK IPL 2024 Match Video Goes Viral

మరికొందరు మాత్రం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో సత్తా చాటాలని విరాట్ కోహ్లీకి విషెస్ చెప్పేందుకు వచ్చిందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. విజయం సాధించడమే కాకుండా రన్ రేట్‌ మెరుగుపరుచుకోవాలి. అప్పుడే సీఎస్‌కేను వెనక్కు నెట్టి ప్లే ఆఫ్స్ చేరుతోంది. సీఎస్‌కే 201 పరుగుల లక్ష్యాన్ని విధిస్తే 18.1 ఓవర్లలోనే చేధించాలి. ఆర్‌సీబీ ముందుగా బ్యాటింగ్ చేసి 200 పరుగులు చేస్తే 18 పరుగుల తేడాతో విజయం సాధించాలి.

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. బెంగళూరు నగరంలో శనివారం వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇది ఆర్‌సీబీ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే, ఇరు జట్లకు చెరో పాయింట్లు లభిస్తుంది.

అప్పుడు ఆర్‌సీబీ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. చిన్నస్వామి స్టేడియంలో అత్యుత్తమ సబ్-ఎయిర్ డ్రైనేజ్, ఏరేషన్ సిస్టమ్ ఉన్నాయి. దీంతో వరుణడు కాస్త కరుణించినా మైదానాన్ని చకచక మ్యాచ్‌కు సిద్ధం చేయొచ్చు. అంతేగాక రాత్రి 11 గంటల వరకు గ్రౌండ్ సిద్ధమైనా అయిదు ఓవర్ల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. దీంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చవచ్చు.

Story first published: Friday, May 17, 2024, 21:08 [IST]
Other articles published on May 17, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+