పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయ్యర్ తన ఇగోను మలిచి జేబులో పెట్టుకోవాలని ఘాటుగా విమర్శించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో గురువారం జరిగిన క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ ఓటమితో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్న పంజాబ్ కింగ్స్.. క్వాలిఫయర్-2 ఆడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. పిచ్ కండిషన్స్‌తో సంబంధం లేకుండా ఫియర్‌లెస్ గేమ్ పేరిట అనవసర షాట్స్‌తో పంజాబ్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు.
క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవాల్సిన శ్రేయస్ అయ్యర్ కూడా చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. ఆర్‌సీబీ స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్ సత్తా గురించి తెలిసి కూడా అతని బౌలింగ్‌లో అటాకింగ్ షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆడిన షాట్‌పై పంజాబ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అయ్యర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్ గాస్కర్ సైతం శ్రేయస్ అయ్యర్ షాట్ సెలెక్షన్‌ను తప్పుబట్టాడు. అనవసర షాట్ అని వ్యాఖ్యానించాడు.

శ్రేయస్ అయ్యర్ ఔటైన విధానంపై ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో షోలో మాట్లాడిన టామ్ మూడీ.. ఘాటుగా విమర్శించాడు. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోవడంలో అయ్యర్ విఫలమయ్యాడని, హజెల్ వుడ్ బౌలింగ్‌లో అతను ఆడిన తీరున బాలేదని చెప్పాడు. 'హజెల్ వుడ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ తొలి బంతిని ఆడి మిస్సయ్యాడు. అది హజెల్ వుడ్ పర్‌ఫెక్ట్ లైన్. ఆ బంతిని అయ్యర్ ఏదో ఆడినట్లు ఆడాడు. వాస్తవానికి ఆ బంతిని వదిలేయాలనుకున్నాడు. మూడో బంతికే అతను ఔటయ్యాడు. పిచ్ కండిషన్స్, తన బాధ్యతలను అయ్యర్ తప్పుగా అంచనా వేశాడు. గతంలో హజెల్ వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాననే విషయం అతనికి తెలుసు. అంతేకాకుండా హజెల్ వుడ్‌పై తన రికార్డ్స్‌పై కూడా అవగాహన ఉంది.
కొన్నిసార్లు శ్రేయస్ అయ్యర్ తన అహంకారాన్ని మడిచి జేబులో పెట్టుకోవాలి. పిచ్ కండిషన్స్‌ను అర్థం చేసుకోకుండా హజెల్ వుడ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో ఆడి శ్రేయస్ అయ్యర్ మూల్యం చెల్లించుకున్నాడు. తన అహంకారాన్ని పక్కనపెట్టి హజెల్ వుడ్ బౌలింగ్ ఆచితూచి ఆడి.. ఇతర బౌలర్లపై అటాక్ చేసుంటే ఫలితం మరోలా ఉండేది.'అని టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో హజెల్ వుడ్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ 22 బంతులు ఎదుర్కొని 4 సార్లు ఔటయ్యాడు. 11 పరుగులు మాత్రమే చేశాడు.
శ్రేయస్ అయ్యర్ బాధ్యతారహిత్యమైన బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ఫైనల్ చేరగా.. పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్-2 ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.