కేకేఆర్.. ఒక పాయింట్ దానం చేశాం!బతుకుపోండి!: శ్రేయస్ అయ్యర్ సోదరి!(వీడియో)
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఒక పాయింట్ దానం చేశామని, బతుకుపోండి అని ఆమె షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సోమవారం కోల్‌కతా వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
వర్షం కారణంగా కేవలం 22 బంతుల ఆట మాత్రమే సాగింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. చివర్లో వర్షం తగ్గినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో అంపైర్లను ఆటను రద్దు చేసి చెరొక పాయింట్ కేటాయించారు. దాంతో కోల్‌కతా పాయింట్ల ఖాతా తెరవగా.. పంజాబ్ కింగ్స్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.
అయితే ఈ మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే పంజాబ్ కింగ్స్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఈ క్రమంలోనే కేకేఆర్‌ను శ్రేష్ట అయ్యర్ తనదైన శైలిలో ట్రోల్ చేసింది. మ్యాచ్ రద్దయిన కాసేపటికే ఇన్‌స్టా వేదికగా శ్రేష్ట్ అయ్యర్ ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆమె పంజాబీలో ఒక చమత్కారమైన జోక్ వేసింది. 'మా పంజాబీలు మనసు చాలా పెద్దది. అందుకే ఒక పాయింట్ ఇచ్చేశాం. బతుకుపోండి'అని పంజాబీలో వ్యాఖ్యానించింది. దాంతో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఈ కామెంట్స్‌పై కేకేఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టాడు. కానీ ఈ క్రెడిట్ పూర్తిగా గౌతమ్ గంభీర్‌కు పోయింది. దాంతో అతను ఆ జట్టును వదిలి పంజాబ్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే శ్రేష్ట అయ్యర్..కేకేఆర్‌ను ట్రోల్ చేసినట్లు అర్థమవుతుంది.
యాదృశ్చికమో ఏమో కానీ గతేడాది కూడా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా పంజాబ్ కింగ్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షంతో తుడుచుకుపెట్టుకుపోయింది. ఆ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పూర్తవ్వగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా వర్షం అంతరాయం కలిగించింది. కానీ తాజా మ్యాచ్‌లో 36.2 ఓవర్ల ఆటను వరణుడు మింగేసాడు.
కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ను గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో కోల్‌కతా వేదికగా ఆడనుండగా.. పంజాబ్ కింగ్స్ శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో న్యూ ముల్లాన్‌పూర్ వేదికగా తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications