For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: కొత్త పేరుతో పాటు లోగోను విడుదల చేసిన ‘పంజాబ్ కింగ్స్’

Punjab Kings unveil their new logo ahead of the IPL 2021 auction

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ అలియాస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొత్త పేరుతో పాటు సరికొత్త లోగో‌ను విడుదల చేసింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగుతున్న ఆ జట్టు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. పాత లోగోలో రెండు గర్జించే సింహాలు ఉండగా.. కొత్త లోగోలో ఒకే సింహాం ఉంది. గత 13 సీజన్లుగా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్.. ఈ సారైనా ఆ కల నేర్చుకోవాలని భావిస్తోంది.

ఫ్రెష్‌గా, టీమ్ కొత్త లుక్ కోసమే పేరు, లోగోను మార్చమని పంజాబ్ కింగ్స్ కో ఓనర్ మోహిత్ బుర్మాన్ తెలిపారు. ఫ్యాన్స్‌, సన్నిహులతో చర్చించి కొత్త పేరును ఖారారు చేశామన్నారు. కొత్త పేరు, లోగో జట్టులో తాజాధనం వస్తుందని తాము బలంగా నమ్ముతున్నామని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ ఇన్ ఫోతో మాట్లాడుతూ అన్నాడు. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్విటర్ ఖాతాకు కూడా ఆ ఫ్రాంచైజీ గుడ్‌ బై చెప్పింది. ఇదే మా చివరి ట్వీట్.. సద్దా అభిమానులకు ధన్యవాదాలంటూ షేర్ చేసింది.

Punjab Kings unveil their new logo ahead of the IPL 2021 auction

కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని కింగ్స్‌ పంజాబ్‌ గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా రాహుల్‌ 675 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నా.. మిగతా ఆటగాళ్లు ఎవరు ఆశించినరీతిలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో మ్యాక్సీతో పాటు షెల్డన్ కాట్రెట్, కే గౌతమ్‌లను వదులుకుంది. రూ.53.2 కోట్ల పర్స్ మనీతో రేపు(గురువారం) జరిగే వేలంలో పాల్గొంటున్న పంజాబ్ కింగ్స్‌లో 9 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Story first published: Wednesday, February 17, 2021, 17:52 [IST]
Other articles published on Feb 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+