Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Mega Auction: రిటైన్ లేదు.. గిటైన్ లేదు! ఒక్కడు కూడా వద్దంటున్న పంజాబ్ కింగ్స్!

 Punjab Kings Makes Crazy Decision With 0 Retentions Before IPL 2022 Mega Auction

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గర పడుతుండటంతో ఆయా ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. వచ్చే సీజన్‌లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగేందుకు పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నాయి. లీగ్‌లోకి కొత్తగా మరో రెండు జట్లు రావడంతో మెగా వేలం నిర్వహణ అనివార్యమైంది. దాంతో గత కొన్నేళ్లుగా బిల్డప్ చేసుకున్న కోర్ టీమ్ చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా భారత స్టార్ ఆటగాళ్లకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఇప్పటికే కొత్త జట్ల ప్రక్రియను పూర్తి చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మెగా వేలం నిర్వహణపై దృష్టిసారించింది. ఇప్పటికే ఆటగాళ్ల రిటెన్షన్ పాలసీని రూపొందించిన భారత క్రికెట్ బోర్డు.. అధికారికంగా ప్రకటించకపోయినా.. ఫ్రాంచైజీలకు అందజేసింది. నవంబర్ 30లోపు రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలని చెప్పింది.

 కొత్త జట్లకు చాన్స్..

కొత్త జట్లకు చాన్స్..

బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్‌ను తీసుకోవచ్చు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి. నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్‌‌కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్‌కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్‌కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్లలో నుంచి కొత్త జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. దాంతో స్టార్ ప్లేయర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అంతేకాకుండా రిటెన్షన్ విధానంలో ఆటగాళ్లదే తుది నిర్ణయమని చెప్పడంతో ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే ఆయా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల కోసం గాలం వేసే పనిలో నిమగ్నమయ్యాయి.

పంజాబ్ కింగ్స్ విచిత్ర నిర్ణయం..

పంజాబ్ కింగ్స్ విచిత్ర నిర్ణయం..

పంజాబ్ కింగ్స్ మాత్రం రిటెన్షన్ జాబితాలో విచిత్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సీజన్లు ఆ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. జట్టు కెప్టెన్, కోచ్, ఆటగాళ్లను.. చివరకు పేరు మార్చినా ఆ టీమ్ తల రాత మాత్రం మారలేదు. ప్రతీ మ్యాచ్ ఉత్కంఠగా మారడం.. గెలవాల్సిన మ్యాచ్‌ను ఆఖరి క్షణంలో చేజార్చుకొని ప్లే ఆఫ్స్ కూడా చేరకుండా వెనుదిరగడంతో ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం తీవ్ర చికాకుకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క ఆటగాడిని కూడా తీసుకునేందుకు పంజాబ్ కింగ్స్ ఇష్టపడటం లేదని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంటుంది. ఇప్పటికే కెప్టెన్ కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌తో ఆడలేనని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే ఇతర ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం దండుగని ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

వేలంలోనే గాలం..

వేలంలోనే గాలం..

రిటెన్షన్ చేసుకుంటే పర్స్ మనీ రూ. 90 కోట్ల నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి రిటైన్ చేసుకోకుండా పూర్తి పర్స్‌తో వేలంలోకి వెళ్తే స్టార్ ఆటగాళ్లను వేలంలో భారీ ధరకు దక్కించుకోవచ్చని ఆ ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రిటెన్షన్ జాబితా, లోపకాయిరి ఒప్పందాలతో ఆయా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను వదులు కోవడంలేదు. ఈ క్రమంలోనే వేలంలోకి వచ్చే ఆటగాళ్లు ఎవరా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వచ్చినా ఇప్పటికే జట్టులో ఉన్నటు వంటి ఆటగాళ్లను దక్కించుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంజాబ్ కింగ్స్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా అనాలోచితమైనదని నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షారూఖ్ ఖాన్ వంటి హిట్టర్..

షారూఖ్ ఖాన్ వంటి హిట్టర్..

జట్టులో మయాంక్ అగర్వాల్, మహమ్మద్ షమీ, షారూఖ్ ఖాన్, రవిబిష్ణోయ్ వంటి ఆటగాళ్లను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకోవచ్చని నెటిజన్లు సూచిస్తున్నారు. కనీసం షారూక్ ఖాన్‌ను అయిన తీసుకోవాలంటున్నారు. ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో షారూఖ్ ఖాన్ సత్తా ఏంటో అందరికి తెలిసిందని, అతన్ని తీసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయంటున్నారు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ అతనితో సంప్రదింపులు జరిపినట్లు ప్రచారం జరుగుతుందని కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే పంజాబ్ జట్టులో ఉండేందుకు షారూఖ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా సుముఖంగా లేరని అందుకే ఆ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం కూడా జరుగుతుంది.

Story first published: Saturday, November 27, 2021, 12:07 [IST]
Other articles published on Nov 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+