Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: పవర్‌ఫుల్‌గా పంజాబ్ కింగ్స్.. పూర్తి జట్టు ఇదే!

ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలంలో కేవలం రూ.11.50 కోట్లతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తక్కువ పర్స్‌‌మనీతో బరిలోకి దిగినా.. జట్టు బలహీనతలను అధిగమించింది.

జట్టుకు భారంగా మారిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ స్థానాన్ని కూపర్ కానలీతో భర్తీ చేసింది. బెన్ ద్వార్షుయిస్‌తో బౌలింగ్ బెంచ్‌ను పటిష్టం చేసుకుంది. ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్ వంటి దేశవాళీ ఆటగాళ్లను బ్యాకప్ ప్లేయర్లుగా తీసుకుంది.

పటిష్టంగా పంజాబ్ కింగ్స్..

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఇప్పటికే సెటిల్‌గా ఉంది. అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్ బౌలర్లు, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి దేశవాళీ హిట్టర్లు జట్టుకు వెన్నెముకగా ఉన్నారు.మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్‌లతో కూడిన ఆల్‌రౌండర్ల జాబితాకు కూపర్ కానలీ జత అయ్యారు.

Punjab Kings IPL 2026 Full Squad List of Players Bought at the Auction

లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, సూపర్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్, బౌన్స్ స్పెషలిస్ట్ మార్కో జాన్సెన్‌తో పేస్ విభాగంలో వైవిధ్యం ఉంది. వీరికి బెన్ ద్వార్షుయిస్ జత కలిసాడు. పేపర్‌పై సమతూకంగా కనిపిస్తున్న పంజాబ్ కింగ్స్ పటిష్టంగా ఉంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో తృటిలో చేజారిన టైటిల్‌ను ఈ సారి ఒడిసిపట్టుకోవాలనే పట్టుదలతో పంజాబ్ కింగ్స్ ఉంది.


పంజాబ్ కింగ్స్ వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు

కూపర్ కానలీ (రూ. 3 కోట్లు), బెన్ ద్వార్షుయిస్ (రూ. 4.40 కోట్లు), ప్రవీణ్ దూబే (రూ. 30 లక్షలు), మరియు విశాల్ నిషాద్ (రూ. 30 లక్షలు).

రిటైన్ లిస్ట్:

శ్రేయస్ అయ్యర్, నెహాల్ వధేరా, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, పైలా అవినాష్, హర్నూర్ పన్ను, ముషీర్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, విష్ణు వినోద్, మార్కస్ స్టోయినీస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సర్యాన్ష్ షెగ్దే, మిచెల్ ఓవెన్, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖ్ విజయ్‌కుమార్, యశ్ ఠాకూర్, గ్జేవియర్ బార్ట్‌లెట్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, హర్‌ప్రీత్ బ్రార్.

తుది జట్టు(అంచనా)

ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, కూపర్ కానలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినీస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, బెన్ ద్వార్షుయిస్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్.

Story first published: Thursday, December 18, 2025, 15:32 [IST]
Other articles published on Dec 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+