Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Punam Raut: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది

Punam Raut says Extremely Disappointed After Being Left Out Of Indias Squad For Womens ODI World Cup 2022

న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్‌కు 15 మందితో కూడిన భారత్ జట్టును ఆలిండియా మహిళల సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. అయితే ఈ జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై టీమిండియా బ్యాటర్ పూనమ్ రౌత్ ఆవేదన వ్యక్తం చేసింది. సెలెక్షన్ కమిటీ నిర్ణయం తననెంతో నిరుత్సాహానికి గురి చేసిందని ట్వీట్ చేసింది. గతేడాది మంచి ప్రదర్శన ఇచ్చినా జట్టులో స్థానం దక్కకపోవడం బాధాకరమని పూనమ్‌ రౌత్‌ పేర్కొంది. ఇక ప్రపంచకప్ బరిలోకి దిగే తన సహచర ఆటగాళ్లకు పూనమ్ అభినందనలు తెలిపింది.

సెంచరీ చేసినా..

సెంచరీ చేసినా..

'అనుభవం కలిగిన బ్యాటర్‌ని. నిలకడగా జట్టు కోసం పరుగులు చేస్తున్న నన్ను పరిగణనలోకి తీసుకోలేదు. ప్రపంచ కప్‌ జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది. 2021లో 73.75 సగటుతో 295 పరుగులు చేశా. అందులో ఒక సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం ఆరు వన్డేల్లోనే ఆ పరుగులను సాధించా. మంచి ప్రదర్శన తర్వాత కూడా జట్టులో చోటుదక్కకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టకు ప్రాతినిథ్యం వహిస్తున్న అమ్మాయిలకు ఆల్‌ ది బెస్ట్‌'' అని పూనమ్ ట్వీట్ చేసింది.

సౌతాఫ్రికాతో సిరీస్‌లో..

సౌతాఫ్రికాతో సిరీస్‌లో..

గతేడాది వన్డేల్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో పూనమ్‌ రౌత్‌ అద్భుత ప్రదర్శన కనబర్చింది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో పూనమ్‌ రౌత్‌ రాణించింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆమె ఆ సిరీస్‌లో సెంచరీతో సహా రెండు హాఫ్‌ సెంచరీలను నమోదు చేసింది. అయితే ఇటీవల జరిగిన దేశవాళీ లీగ్‌ 'ఉమెన్స్ సీనియర్‌ వన్డే' ట్రోఫీలో మాత్రం పేలవ ప్రదర్శన చేయడంతో సెలెక్టర్లు ఆమెను ప్రపంచకప్ కోసం పరిగణలోకి తీసుకోలేదు.

ఆ ట్రోఫీలో ఆరు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక అర్ధశతకం మాత్రమే చేసింది.

న్యూజిలాండ్‌తో షురూ..

న్యూజిలాండ్‌తో షురూ..

న్యూజిలాండ్‌ వేదికగా మార్చి నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్ -2022 ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రపంచకప్ ముందు మిథాలీ సేన న్యూజిలాండ్‌తో ఫిబ్రవరి 11 నుంచి ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌స్టేజ్‌లో మార్చి 11 న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్, మార్చి 16న ఇంగ్లండ్, మార్చి 19న ఆస్ట్రేలియా , మార్చి 22న బంగ్లాదేశ్‌, మార్చి 27న సౌతాఫ్రికాతో టీమిండియా తలపడుతుంది.

భారత ప్రపంచకప్‌ జట్టు:

భారత ప్రపంచకప్‌ జట్టు:

మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, షెఫాలీవర్మ, యాస్తిక భాటియా, దీప్తిశర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), స్నేహ్‌ రాణా, జూలన్‌ గోస్వామి, పూజ వస్త్రకార్‌, మేఘన సింగ్‌, రేణుక సింగ్‌ ఠాకూర్‌, తానియా భాటియా (వికెట్‌ కీపర్‌), రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌

స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్‌, సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌

Story first published: Friday, January 7, 2022, 21:05 [IST]
Other articles published on Jan 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+