Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pujara vs Wagner: దూసుకొచ్చిన రాకాసి బౌన్సర్.. విరిగిపోయిన హెల్మెట్.. నయావాల్‌కు తప్పిన ప్రమాదం!

Pujara vs Wagner: Cheteshwar Pujara Helmet And Protective Gear came out by a Neil Wagner bouncer

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారాకు పెను ప్రమాదం తప్పింది. కివీస్ పేసర్ నీల్ వాగ్నర్ వేసిన షార్ట్ పిచ్ బాల్ పుజారా హెల్మెట్‌కు బలంగా తాకింది. బంతి వేగానికి హెల్మెట్ విరిగిపోయింది. అదృష్టవశాత్తు పుజారాకు ఎలాంటి గాయం కాలేదు. వాగ్నర్ వేసిన 37 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసిన రెండో బంతి రాకాసి బౌన్సర్‌గా పుజారా ముఖంపైకి దూసుకొచ్చింది. అయితే ఈ బంతిని పుల్ షాట్ ఆడబోయిన పుజారా.. అంచనా వేయడంలో విఫలమై అడ్వాన్స్ అయ్యాడు. దాంతో బంతి బ్యాట్ మిస్సై హెల్మెట్ గ్రిల్స్‌ను బలంగా తాకింది.

ఆ దెబ్బకు హెల్మెట్ స్టెమ్ గార్డ్స్ విరిగి గాల్లో ఎగిరిపడ్డాయి. గ్రిల్స్ లేకుంటే పుజారా మూతి పచ్చడయ్యేది. వెంటనే టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చి పుజారాను పరిశీలించాడు. ఎలాంటి గాయం కాకపోవడంతో పుజారా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఇక కంకషన్ నిబంధనల ప్రకారం బంతి తలకు తాకిన ప్రతీసారి ఫిజియో పరిశీలించాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అయ్యాయి.

మ్యాచ్ విషయానికొస్తే.. 40 ఓవర్ల పూర్తయ్యే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 87 రన్స్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(13 బ్యాటింగ్), పుజారా(8 బ్యాటింగ్) నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైంది. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తున్న ఈ జోడీ వీలు చిక్కిన బంతిని మాత్రమే బౌండరీకి తరలించే ప్రయత్నం చేస్తుంది.

అంతకుముందు ఓపెనర్లు రోహిత్ శర్మ(68 బంతుల్లో 34), శుభ్‌మన్ గిల్(64 బంతుల్లో 28) మంచి శుభారంభాన్ని అందించారు. చూడ చక్కని షాట్లతో అలరించిన ఈ జోడీ తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. క్రీజులో కుదురుకుపోయిన ఈ జోడీ.. ఓదశలో వికెట్ కోల్పోకుండా సెషన్ ముగిస్తుందా? అనిపించించింది. కానీ 21 ఓవర్ అందుకున్న కైల్ జెమీసన్ ఫస్ట్ బాల్‌కే మంచి బ్రేక్ త్రూ అందించాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. అతను వేసిన బంతిని హాఫ్ షాట్ ఆడిన రోహిత్ థర్డ్ స్లిప్‌లో టిమ్ సౌథీ చేతికి చిక్కాడు. లో క్యాచ్‌గా వచ్చిన ఈ బంతిని సౌథీ అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే శుభ్‌మన్ గిల్‌ను తన ఫస్ట్ ఓవర్లోనే వాగ్నర్ పెవిలియన్ చేర్చాడు. కీపర్ క్యాచ్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 68/2 స్కోర్ వద్ద ఫస్ట్ సెషన్ ముగించింది.

Story first published: Saturday, June 19, 2021, 18:44 [IST]
Other articles published on Jun 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+