రాహుల్, జడేజా, పుజారకు నాడా నోటీసులు

న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్ సమయంలో తాము ఎక్కడ ఉన్నామో తెలపలేదనే కారణంతో ఐదుగురు భారత క్రికెటర్లకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజాలతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మంధాన, దీప్తి శర్మలు ఈ నోటీసులందుకున్నారు.
అయితే ఈ నోటీసులపై ఆటగాళ్ల తరఫున బీసీసీఐ నాడాకు వివరణ ఇచ్చింది. సంబంధిత దరఖాస్తు ఫారానికి సంబంధించిన వెబ్‌సైట్ పాస్‌వర్డ్‌లో సమస్య కారణంగానే వారి వివరాలు పంపడంలో ఆలస్యమైందని తెలిపింది. దీనిపై స్పందించిన నాడా బీసీసీఐ వివరణ న్యాయబద్ధంగానే ఉందని, ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు.
సాధారణంగా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్లు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో రెగ్యులర్‌గా నాడాకి చెందిన సాప్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తుంటారు. కొన్ని సార్లు క్రికెటర్లకి తీరిక లేకపోతే.. బీసీసీఐ ఆ బాధ్యత తీసుకుని ఆటగాళ్లకి బదులుగా వారి సమాచారాన్ని అప్‌డేట్ చేస్తుంటుంది.
సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న క్రికెటర్లపై బీసీసీఐ ఎప్పుడూ నిఘా ఉంచే ఉంటుంది. సిరీస్‌లు లేని సమయాల్లో ఆటగాళ్లు తమ ప్రయాణ వివరాల్ని.. ముఖ్యంగా విదేశీ టూర్‌లపై బోర్డుకి సమాచారం అందించాల్సి ఉంటుంది. అలానే నాడా కూడా ఆటగాళ్ల నుంచి రెగ్యులర్‌గా సమాచారం సేకరిస్తూ ఉంటుంది. మ్యాచ్ ఫిక్సింగ్, బుకీల సంప్రదింపుల్ని కట్టడి చేసేందుకు క్రికెట్ బోర్డులు ఇలా నిఘా వేస్తుంటాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications