Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌తో పోటీపడలేం.. పీఎస్‌ఎల్ బ్రాడ్‌కాస్టర్ గగ్గోలు! తోక ముడిచిన పాక్

ఐపీఎల్ కంటే పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) గొప్పదని ఆ దేశ ఆటగాళ్లు విర్రవీగుతారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఐపీఎల్‌ దెబ్బకు తోకముడిచింది. ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్ నిర్వహించడం వల్ల ప్రకటనల ఆదాయం భారీగా తగ్గిందని బ్రాడ్‌కాస్టర్స్‌ గగ్గోలు పెట్టడంతో పీసీబీ వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది.

అప్‌కమింగ్ పీఎస్‌ఎల్ 2027 సీజన్‌ను జనవరిలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఏడాది కూడా ఐపీఎల్ 2026 సీజన్‌కు పోటీగా పీఎస్‌ఎల్ 2026 సీజన్‌ను పీసీబీ నిర్వహించింది. అయితే సెప్టెంబర్ 1న లండన్ వేదికగా జరిగిన పీఎస్‌ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఐపీఎల్‌కు పోటీగా పీఎస్‌ఎల్ నిర్వహించవద్దనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.

IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!

IND vs PAK: బ్రాడ్‌కాస్టర్‌కు భారీ బొక్క.. నట్టేట ముంచిన పాక్!

బ్రాడ్‌కాస్టర్ రిక్వెస్ట్..

పీఎస్‌ఎల్ మీడియా హక్కులు వాలీ టెక్నాలజీస్ అనే సంస్థకు ఉన్నాయి. ఆ సంస్థకు పీఎస్‌ఎల్‌లో ఓ ఫ్రాంచైజీ కూడా ఉంది. ఆ సంస్థనే పీఎస్ఎల్‌ను జనవరి-ఫిబ్రవరిలో నిర్వహించాలనే ప్రతిపాదన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

PSL 2027 Likely to Move to January Window to Avoid Clash with IPL After Raises Advertising Concerns

అరంగేట్ర పీఎస్‌ఎల్ 2016 నుంచి ఫిబ్రవరి-మార్చ్ విండోలోనే నిర్వహించేవారు. అయితే 2025, ఈ ఏడాది ఆ విండోలో ఐసీసీ ఈవెంట్స్ ఉండటంతో ఐపీఎల్‌తో పోటీగా పీఎస్‌ఎల్‌ను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాక్ ప్రదర్శనపై ఫ్రాంచైజీల ఆందోళన..

మూడు ఫార్మాట్లలోనూ పాకిస్థాన్ పేలవ ప్రదర్శనల నేపథ్యంలో పీఎస్ఎల్‌పై ఆసక్తి తగ్గుతుందని ఫ్రాంచైజీ యజమానులు ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏప్రిల్-మే విండో.. బ్రాడ్‌కాస్టర్స్‌కు అనుకూలంగా లేదని హక్కుదారులు తెలిపినట్లు సమాచారం. పీఎస్‌ఎల్ ఒప్పందం ప్రకారం.. 8 ఫ్రాంచైజీలు.. బ్రాడ్‌కాస్ట్ రెవెన్యూలోని సెంట్రల్ పూల్‌ నుంచి 95 శాతం వాటాను తీసుకుంటున్నాయి.

ఆట కాదు.. బలుపుతోనే రిజ్వాన్, ఇమామ్, అఘా చోటు కోల్పోయారు!

Also Read

ఆట కాదు.. బలుపుతోనే రిజ్వాన్, ఇమామ్, అఘా చోటు కోల్పోయారు!

అప్‌కమింగ్ సీజన్‌ను కరాచీ వేదికగా ప్రారంభించి ఆ తర్వాత పెష్వార్, పంజాబ్‌కు విస్తరించాలని కూడా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు నవంబర్ -మార్చి మధ్య ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా లేవు. 2029 వరకు వాలీ టెక్నాలజీస్‌కు పీఎస్‌ఎల్ బ్రాడ్‌కాస్ట్ రైట్స్ ఉన్నాయి. ఫ్రాంచైజీలు , బ్రాడ్‌కాస్టర్‌కు అదనపు ఆదాయ మార్గాన్ని అందించడంతో పాటు పీఎస్ఎల్ ప్రాచుర్యాన్ని కొనసాగించడంలో కూడా సహాయపడే విధంగా ఈ ప్రతిపాదనను పీసీబీ ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది.

Story first published: Monday, September 7, 2026, 10:37 [IST]
Other articles published on Sep 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+