Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2025లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ రచ్చ..!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శత్రు దేశం పాకిస్థాన్‌లోనూ విరాట్ కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కోహ్లీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకపోయినా అతని ఆటను టీవీల్లో చూస్తూ.. అభిమానించే వారి సంఖ్య లక్షల్లో ఉంది. అనేక సందర్భాల్లో కోహ్లీపై తమకు ఉన్న అభిమానాన్ని పాకిస్థాన్ ఫ్యాన్స్ చాటుకున్నారు.

తమ దేశంలో జరిగే మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీలతో హాజరయ్యారు. కోహ్లీ‌పై ఉన్న ప్రేమతోనే ఐపీఎల్‌లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్‌సీబీని అభిమానులు ఆరాధిస్తున్నారు. అత్యంత అభిమాన గణం ఉన్న జట్టుగా ఆర్‌సీబీ ఇప్పటికే రికార్డు సాధించింది. గత 18 సీజన్లుగా ఆర్‌సీబీ ఒక్క టైటిల్ గెలవకపోయినా.. ఆ జట్టుపై అభిమానుల ప్రేమ ఏ మాత్రం తగ్గడం లేదు.

PSL 2025 Fans spotted wearing RCB jerseys in Pakistan
Photo Credit: twitter (X)

అయితే ఐపీఎల్ 2025 సీజన్‌కు పోటీగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నిర్వహిస్తున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్)2025 సీజన్‌లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ఆర్‌సీబీ జెర్సీలతో పీఎస్‌ఎల్ మ్యాచ్‌కు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఉంటారని, కానీ ఆ జట్టు మాత్రం టైటిల్ గెలవలేదని సెటైర్లు పేల్చుతున్నారు.

మరికొందరు ఐపీఎల్‌ను పీఎస్‌ఎల్‌తో పోల్చుతూ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ట్రోల్ చేస్తున్నారు.పీఎస్‌ఎల్‌లో ఐపీఎల్ క్రేజ్..ఇంత కంటే ఇంకేం కావాలి? అని కామెంట్ చేస్తున్నారు. పీఎస్‌ఎల్ మ్యాచ్‌లు జరుగుతున్నా.. ఆ దేశ ప్రేక్షకులు ఐపీఎల్ చూస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. 6 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను శుక్రవారం బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.

Story first published: Thursday, April 17, 2025, 13:08 [IST]
Other articles published on Apr 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+