పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లోనే ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. రావల్పిండి వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలాండర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పీఎస్‌ఎల్ చరిత్రలోనే తొలిసారి ఐపీఎల్‌తో పోటీపడుతోంది. ఐపీఎల్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలో అత్యధిక బ్రాండ్ వాల్యూ, పాపులారిటీ కలిగిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. పీఎస్‌ఎల్ ఆ స్థాయికి చేరుకోలేకపోయింది. ఇంటర్నేషనల్ స్టార్ కూడా పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్ ఆడేందుకు మొగ్గు చూపుతారు.
ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే వెనుదిరిగిన పాక్.. న్యూజిలాండ్ పర్యటనలో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. ఐదు టీ20ల సిరీస్‌ను పాక్ 1-4తో మూడు వన్డేల సిరీస్ 0-3తో కోల్పోయింది. పీఎస్‌ఎల్‌తో క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 జరగనున్న నేపథ్యంలో పీఎస్‌ఎల్ ద్వారా కొత్త ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.

అంతేకాకుండా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, ఇతర సీనియర్ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ ద్వారా టచ్‌లోకి రావాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. పీఎస్‌ఎల్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసి బిర్యానీ ఫీస్ట్.. క్రికెట్ అభిమానులను షాక్ అయ్యేలా చేసింది. పాకిస్థాన్ స్టార్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజామ్, మహమ్మద్ హ్యారిస్‌లు కంచాల నిండ బిర్యానీ తింటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అత్యధిక కార్బోహైడ్రెట్స్ ఉండే బిర్యానీ పాక్ ఆటగాళ్లు ఎలా తింటున్నారని? ఒక్కరికి ఫిట్‌నెస్ శ్రద్ద లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు పీసీబీ.. ఈ ఫుడ్‌ను ఎలా అనుమతిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'పాకిస్థాన్ ప్రధాన ఆటగాళ్లు తినేది చూడండి. రేపు పీఎస్‌ఎల్ ప్రారంభం. ఆ ప్లేయర్లు కంచాల నిండ కార్బోహైడ్రైట్స్ తింటున్నారు. పీసీబీకి, సదరు ఫ్రాంచైజీ, ఆటగాళ్లుకు ఎలాంటి సీరియస్‌నెస్ లేదు. వాళ్లు అన్‌ఫిట్‌గా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.'అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.