Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2023: రికార్డు సెంచరీ బాదిన బాబర్ ఆజామ్‌కు తప్పని తిట్లు!

PSL 2023: Simon Doull slams Babar Azam for slowing down before century

కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మరోసారి అభిమానులు ఆగ్రహానికి గురయ్యాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)2023 సీజన్‌లో రికార్డు సెంచరీ బాదినా బాబర్‌కు తిట్లు తప్పలేదు. పీఎస్‌ఎల్‌లో పెషావర్ జెల్మీ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బాబర్ ఆజమ్.. క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్..

60 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 22 సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. 8 సెంచరీలతో బాబర్ ఆజామ్.. మైకేల్ కింగ్లర్, డేవిడ్ వార్నర్‌ల రికార్డును సమం చేసాడు.

240 పరుగుల భారీ స్కోర్ చేసినా..

బాబర్ ఆజమ్(65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 115) సూపర్ సెంచరీ‌తో పెషావర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోరు చేసింది. బాబర్‌తో పాటు సయిం అయూబ్ (34 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) హాఫ్ సెంచరీ బాదగా.. రోవ్‌మన్ పావెల్ (18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 35) మెరుపులు మెరిపించాడు. బాబర్ ఆజమ్ 175+ స్ట్రైయిక్ రేటుతో బ్యాటింగ్ చేస్తే, పెషావర్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన మిగిలిన ముగ్గురు 200లకు పైగా స్ట్రైయిక్ రేటుతో ఆడారు. అయితే 240 పరుగుల కొండంత లక్ష్యాన్ని కూడా బాబర్ సేన కాపాడుకోలేకపోయింది.

జాసన్ రాయ్ విధ్వంసం..

బ్యాటింగ్‌కు అనుకూలమైన ఫ్లాట్ ట్రాక్‌పై క్వెట్టా గ్లాడియేటర్స్ 18.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 241 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది.

ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (63 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 145 నాటౌట్) విధ్వంసకర సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

మార్టిన్ గప్టిల్ (8 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21) (విల్ సమీద్ 22 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 26), మహ్మద్ హఫీజ్ (18 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41) ధాటిగా ఆడారు.

వ్యక్తిగత రికార్డుల కోసమా..?

వ్యక్తిగత రికార్డుల కోసమా..?

బాబర్ ఆజామ్ స్లో బ్యాటింగ్ వల్లే పెషావర్ టీమ్ ఓడిపోయిందని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెట్ సైమన్ డౌల్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశాడు.'బాబర్ ఆజామ్‌కు జట్టు కంటే సెంచరీ ముఖ్యమైంది. ఎప్పుడైనా వ్యక్తిగత రికార్డులకు ఆఖరి ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఇక్కడ మాత్రం జట్టుకు ఆఖరి ప్రాధాన్యత దక్కుతోంది. బౌండరీలు కొట్టకుండా సెంచరీ పూర్తి చేసుకోవాలని బాబర్ ప్రయత్నించాడు. సెంచరీలు చేయడం, గణాంకాలు నమోదు చేయడం చాలా పెద్ద విషయమే. అయితే అన్నింటికంటే ముందు జట్టు ముఖ్యం. విజయాలే ప్రాధాన్యం.' సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, March 9, 2023, 13:59 [IST]
Other articles published on Mar 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+