Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PSL 2023 ఛాంపియన్ లాహోర్.. ఒక్క పరుగు తేడాతో టైటిల్ చేజార్చుకున్న ముల్తాన్ సుల్తాన్స్!

PSL 2023: Lahore Qalandars beat Multan Sultans by 1 run to win clinch the 2nd Tittle

లాహోర్: పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL 2023) 2023 సీజన్‌లో లాహోర్ ఖలాండర్స్ (Lahore Qalandars) ఛాంపియన్‌గా నిలిచింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన లాహోర్.. అసాధారణ ఆటతీరుతో వరుసగా రెండో టైటిల్ గెలిచింది. శనివారం ముల్తాన్ సుల్తాన్స్‌(Multan Sultans)తో జరిగిన ఫైనల్లో షాహిన్ షా అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలాండర్స్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్ చివరి బంతికి 4 పరుగులు చేయలేక టైటిల్ చేజార్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలాండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది. అబ్దుల్ షఫీక్(40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. షాహిన్ షా అఫ్రిది(15 బంతులల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఓపెనర్లు మిర్జా బైగ్(18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 30), ఫకార్ జమాన్(34 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 39) మంచి శుభారంభాన్ని అందించారు. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లలో ఉస్మాన్ మిర్ మూడు వికెట్లు తీయగా.. కుష్దిల్ షా, ఇహ్‌సానుల్లా, అన్వర్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

PSL 2023: Lahore Qalandars beat Multan Sultans by 1 run to win clinch the 2nd Tittle

అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముల్తాన్ సుల్తాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 199 పరుగులు చేసి ఓటమిపాలైంది. రిలీ రోసౌ(32 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. మహమ్మద్ రిజ్వాన్(23 బంతుల్లో 5 ఫోర్లతో 34), కుష్దిల్ షా(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) పర్వాలేదనిపించారు. లాహోర్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది 4 వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. డేవిడ్ వైస్ ఓ వికెట్ పడగొట్టాడు. చివరి ఓవర్‌లో ముల్తాన్ సుల్తాన్స్ విజయానికి 13 పరుగులు అవసరమవ్వగా.. లాహోర్ బౌలర్ జమాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

PSL 2023: Lahore Qalandars beat Multan Sultans by 1 run to win clinch the 2nd Tittle

ఈ ఓవర్ తొలి నాలుగు బంతులకు ఐదు పరుగులే రావడం.. ఐదో బంతికి కుష్దిల్ బౌండరీ కొట్టడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమ్వగా.. రెండు పరుగుల తీసిన తర్వాత కుష్దిల్ రనౌటవ్వడంతో మ్యాచ్ లాహోర్ సొంతమైంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన షాహిన్ షా అఫ్రిదికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇహ్‌సానుల్లాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరించింది. షాహిన్ అఫ్రిది సారథ్యంలోనే లాహోర్ వరుసగా రెండు పీఎస్‌ఎల్ టైటిల్స్ గెలవడం గమనార్హం. దాంతో అతన్ని పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.

Story first published: Sunday, March 19, 2023, 10:28 [IST]
Other articles published on Mar 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+