For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PSL 2022: పాక్ క్రికెట్ బోర్డుకు ఎదురుదెబ్బ.. ఫీజు చెల్లంచలేదంటూ ఆసీస్ క్రికెటర్ వాకౌట్!

James Faulkner withdraws from Pakistan Super League

న్యూఢిల్లీ: సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్దరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పీసీబీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2022 సీజన్ నుంచి ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జేమ్స్ ఫాల్కనర్ అర్థంతరంగా తప్పుకున్నాడు. లీగ్‌ నుంచి నిష్క్రమిస్తూ పీసీబీపై సంచలన ఆరోపణలు చేశాడు. పీసీబీ.. ఒప్పందంలో భాగంగా తనకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదని ట్విటర్ వేదికగా ఆరోపించాడు.

'పాకిస్థాన్​ క్రికెట్​ ఫ్యాన్స్‌కు క్షమాపణలు. దురదృష్టవశాత్తు మరో రెండు మ్యాచ్​లు మిగిలి ఉండగానే నేను లీగ్​ నుంచి తప్పుకోవాల్సి వస్తోంది. పీసీబీ నా ఫీజును చెల్లించకపోవడమే ఇందుకు కారణం. నేను ఇంతకాలం వేచి చూసినా.. ఇంకా వారు అబద్ధాలు చెప్తూనే కాలయాపన చేస్తున్నారు. పాకిస్థాన్​లో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్​ను తీసుకురావడంలో నా వంతు కృషి చేద్దామని అనుకున్న నాకు ఇలా మధ్యంతరంగా వెళ్లి పోవడం బాధగానే ఉంది . కానీ ఇక్కడ నాతో బోర్డు వ్యవహరించిన తీరు నచ్చకే నిష్క్రమిస్తున్నాను. మీరందరూ నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను'అని జేమ్స్ ఫాల్కనర్ ట్వీట్ చేశాడు.

ఇక ఫాల్కనర్ చేసిన సంచలన​ ఆరోపణలను పీసబీ, క్వెట్టా గ్లాడియేటర్స్​ టీమ్‌మేనేజ్‌మెంట్ కొట్టిపారేసాయి. అవన్నీ అర్థరహితమైన ఆరోపణలని తోసిపుచ్చాయి. ఇందుకు సంబంధించి సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఫాల్కనర్​పై జీవితకాలం నిషేధం విధిస్తున్నట్లు పీసీబీ ప్రకటించింది.
'మాపైన ఫాల్కనర్​ ఈ తరహా ఆరోపణలు చేసినందుకు చింతిస్తున్నాం. గతేడాది నుంచే పీఎస్​ఎల్‌లో భాగమైన ఫాల్కనర్​కు ఏ లోటు రాకుండా చూసుకున్నాం. ఈ ఏడేళ్లలో ఏ ఆటగాడు కూడా మాపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. మేం చేస్తున్న కృషికి వారు ప్రశంసించేవారు."'అని ఆ ప్రకటనలో పేర్కొంది.

PSL 2021 Final Highlights | Multan Sultans | Oneindia Telugu

ఫాల్కనర్​కు 70 శాతం ఫీజును చెల్లించేశామని.. మిగిలిన 30 శాతానికి పీఎస్ఎల్​ లీగ్​ ముగిసిన 40 రోజుల దాకా గడువుందని పీసీబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఫాల్కనర్​కు ఎలాంటి బాకీ లేమని పేర్కొంది. "2021 డిసెంబరులో ఫాల్కనర్​ ఏజెంట్.. ఫీజు చెల్లింపుల కోసం​ యూకేలోని బ్యాంకు అకౌంట్​ వివరాలు ఇచ్చాడు. మళ్లీ ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని బ్యాంక్​ అకౌంట్​కే ఫీజు పంపాలంటూ ఆ వివరాలు అందించాడు. కానీ ఫాల్కనర్​కు మేం అతని పాత అకౌంట్​కే 70 శాతం ఫీజును చెల్లించాం. తనకు డబ్బులు అందినట్టు ఫాల్కనర్​ కూడా నిర్ధరించాడు. మళ్లీ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు"అని పీసీబీ వివరణ ఇచ్చింది. ఇక పీసీబీ ప్రకటనపై ఫాల్కనర్ స్పందించాల్సి ఉంది.

Story first published: Saturday, February 19, 2022, 22:25 [IST]
Other articles published on Feb 19, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+