Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Faf du Plessis: సహచర ఆటగాడిని ఢీకొట్టిన సీఎస్‌కే స్టార్.. తలకు తీవ్రగాయం.. ఆసుపత్రికి తరలింపు!

PSL 2021: Faf du Plessis taken to hospital after scary collision with teammate

అబుదాబి: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్, వెటరన్ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)‌లో భాగంగా శనివారం జరిగిన ఓ మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపేక్రమంలో సహచర ఆటగాడిని గట్టిగా ఢీకొట్టడంతో డుప్లెసిస్ తలకు బలమైన గాయమైంది. చెవి కింది భాగంలో ఎర్రగా కమిలిపోయింది. ఈ గాయంతో అతను మైదానంలోనే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

సహచర ఆటగాడిని ఢీకొట్టి..

దుబాయ్ వేదికగా ప్రారంభమైన పీఎస్‌ఎల్ సెకండాఫ్‌లో శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ పాక్ టీ20 లీగ్‌లో క్వెట్టా గ్రాడియేటర్స్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న డుప్లెసిస్.. బౌండరీ లైన్ వద్ద బంతిని అడ్డుకునే క్రమంలో సహచర ఆటగాడైన మహమ్మద్‌ హస్‌నెయిన్‌ను ఢీ కొట్టాడు.

హసనెయిన్‌ మోకాలి చిప్ప బలంగా అతని తలకు తాకడంతో డుప్లెసిస్‌ కళ్లు తిరిగి పడిపోయాడు. ఈ ఘటనతో మైదానంలోని అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన డుప్లెసిస్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

త్వరగా కోలుకోవాలని..

త్వరగా కోలుకోవాలని..

డుప్లెసిస్‌ గాయంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. డుప్లెసిస్ గాయంపై చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్పందించింది. గెట్ వెల్ సూన్ ఫాఫ్ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన డుప్లెసిస్‌.. తిరిగి హోటల్‌ రూమ్‌కి చేరుకున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ ఘటన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటనను తలపించడంతో అంతా ఆందోళనకు గురయ్యారు.

 డుప్లెసిస్ టీమ్ చిత్తు..

డుప్లెసిస్ టీమ్ చిత్తు..

ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ టీమ్ క్వెట్టా గ్లాడియేటర్స్‌ 61 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 197 రన్స్ చేసింది. కమ్రాన్ అక్మల్(59), డేవిడ్ మిల్లర్(73), రొవ్‌మెన్ పోవెల్(43 నాటౌట్) రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు క్వెట్టా గ్లాడియేటర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులే చేసింది. సర్ఫరాజ్అహ్మద్(36 నాటౌట్), ఉస్మాన్ ఖాన్(28), సైమ్ అయుబ్(35) మినహా అంతా విఫలమయ్యారు. గాయంతో డుప్లెసిస్ బ్యాటింగ్‌కు రాలేదు.

ఆండ్రీ రసెల్‌​ తలకు గాయం

ఆండ్రీ రసెల్‌​ తలకు గాయం

ఇదే టోర్నీలో వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ కూడా గాయపడ్డాడు. అతను కూడా క్వెట్టా గ్లాడియర్స్‌ ప్లేయర్స్ కావడం విశేషం. ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రస్సెల్‌ తలను ఓ రాకాసి బౌన్సర్ బలంగా తాకింది. షాట్‌ ఆడిన అనంతరం తల పట్టేయడంతో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ అలానే కింద కూర్చుండిపోయాడు.

దీంతో అప్రమత్తమైన సిబ్బంది స్ట్రెచర్‌ తీసుకొచ్చి రసెల్‌ను తీసుకెళ్లారు. అయితే అతడికి పెద్ద ప్రమాదమేమీ లేదని సమాచారం. రసెల్‌ గాయం తీవ్రత గురించి ఎక్స్‌రే తర్వాతే తెలియనుంది. దీనికి సంబంధించిన వీడియోనూ పీఎస్‌ఎల్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి.

Story first published: Sunday, June 13, 2021, 11:55 [IST]
Other articles published on Jun 13, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+